close

తాజా వార్తలు

Published : 20/10/2020 07:06 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ఆస్తి దక్కదేమోనని ఆత్మహత్య!

అన్నపేరిటే నమోదుచేశారని మనస్తాపం చెందిన వృద్ధుడు

కంది: ప్రభుత్వం చేపట్టిన వ్యవసాయేతర ఆస్తుల సర్వేలో అధికారులు తన ఫొటో తీసుకోలేదనే బెంగతో ఓ వృద్ధుడు సోమవారం ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన సంగారెడ్డి జిల్లా కంది మండలం ఇంద్రకరణ్‌లో చోటుచేసుకుంది. ఎస్సై బాలస్వామి తెలిపిన వివరాల ప్రకారం... వ్యవసాయేతర ఆస్తుల నమోదు సందర్భంగా పంచాయతీ సిబ్బంది కుటుంబానికి వారసత్వంగా వచ్చిన ఆస్తిని ఇంటి పెద్ద కొడుకు పెంటయ్య పేరుతో నమోదు చేసి ఆయన తమ్ముడు శంకరయ్య(68)తోపాటు ఇతరుల పేర్లను కుటుంబ సభ్యుల జాబితాలో ఎక్కించారు. మనస్పర్థలతో శంకరయ్య, భార్య ముగ్గురు పిల్లలతో 30 ఏళ్లుగా ఇస్నాపూర్‌లో ఉంటున్నారు. సొంత గ్రామంలో ఆస్తుల నమోదు విషయం తెలుసుకున్న శంకరయ్య ఇటీవల పంచాయతీ సిబ్బందిని కలిశారు. తండ్రికి ఇద్దరు కొడుకులం ఉండగా... ఆస్తిని పెద్ద కొడుకు పేరుతోనే ఎందుకు నమోదు చేస్తారని? ఫొటో తీసుకుని తన పేరుపై కూడా నమోదు చేయాలని ఆయన పంచాయతీ సిబ్బందిని అడిగారు. ఇల్లు పెంటయ్య పేరుతో ఉండటంతో ఆయన ఫొటో తీసుకుని రికార్డుల్లో నమోదు చేశామని, శంకరయ్య పేరు కూడా కుటుంబ సభ్యుల జాబితాలో చేర్చామని పంచాయతీ కార్యదర్శి రాజ్‌కుమార్‌ పేర్కొన్నారు. దీంతో ఆస్తి తనకు దక్కదేమోనని మనస్తాపానికి గురైన శంకరయ్య సోమవారం చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. మృతదేహానికి ప్రభుత్వాసుపత్రిలో పంచనామా నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించి కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.


Tags :

క్రైమ్

రాజకీయం

జనరల్‌

సినిమా

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

చిత్ర వార్తలు

సినిమా
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.