close

తాజా వార్తలు

Published : 25/11/2020 08:00 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

పట్టిన పామే.. కాటేసింది

కాటేయడానికి ముందు పామును పట్టుకున్న నాగరాజు

విశాఖపట్నం: పాములు పట్టడం అతనికి తెలిసిన విద్యే.. ఎలాంటి పామునైనా చాకచక్యంగా బంధించి బుట్టలో వేసేయగలడు. అనుకోని రీతిలో పట్టుకున్న పామే కాటేసింది. హెచ్‌పీసీఎల్‌ రిఫైనరీ ప్రహరీకి ఆనుకొని ఉన్న రాంనగర్‌లోని ఓ ఇంట్లో మంగళవారం నాగుపాము రావడంతో కుటుంబ సభ్యులు పాములుపట్టే నేర్పరి నాగరాజుకు సమాచారం ఇచ్చారు. అతను అక్కడకు చేరుకొని పామును బంధించాడు. దాన్ని గోనె సంచిలో వేస్తుండగా.. పాము తల బయటకు వచ్చిన విషయాన్ని చీకట్లో గమనించలేదు. సంచికి తాడు కడుతుండగా చేతిపై కాటు వేసింది. వెంటనే కేజీహెచ్‌కు వెళ్లగా వైద్యులు పరిశీలించారు. నాగరాజు చేతిపై పాము పన్ను దిగి విరిగిపోయినట్లు గుర్తించి దానిని తొలగించారు. విషం శరీరంలోకి ఎక్కిందా లేదా అనేది తెలియాలంటే రక్త పరీక్ష చేయాల్సి ఉంటుందని.. అయితే ప్రమాదం లేదని చెప్పారు.


Tags :

క్రైమ్

రాజకీయం

జనరల్‌

సినిమా

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

చిత్ర వార్తలు

మరిన్ని

దేవతార్చన