
తాజా వార్తలు
భార్య గొంతు కోసిన భర్త
ఆపై ఆత్మహత్యాయత్నం.. మద్యం మత్తులో ఘటన
పుల్లంపేట : మద్యం మత్తులో ఓ వ్యక్తి భార్య గొంతు కోయడంతో పాటు తాను కూడా కంఠం కోసుకున్న సంఘటన పుల్లంపేట మండలం వత్తలూరు పంచాయతీ దేవసముద్రం వడ్డిపల్లెలో చోటుచేసుకుంది. స్థానికులు అందించిన సమాచారం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి.. బుధవారం సాయంత్రం మద్యం మత్తులో ఇంటికి వచ్చిన శ్రీను (30) తన భార్య మంగమ్మ (24)తో గొడవపడ్డాడు. జోరుగా వర్షం పడుతుండటంతో చుట్టుపక్కల వారు ఎవరిళ్లలో వారున్నారు. భార్యాభర్తల మధ్య ఏం జరిగిందో తెలియదు కాని గొంతు తెగి రక్తం కారుతున్న స్థితిలో ఉన్న మంగమ్మను చూసిన స్థానికులు 108కు సమాచారం చేరవేశారు. భార్యపై దాడి చేసిన తర్వాత శ్రీను తాను కూడా గొంతు కోసుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు. 108 సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని భార్యాభర్తలను రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం కడప సర్వజన ఆసుపత్రికి తరలించినట్లు ఆసుపత్రి వర్గాలు తెలిపారు.
క్రైమ్
రాజకీయం
జనరల్
సినిమా
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
చిత్ర వార్తలు
సినిమా
- భారత్-ఎ జట్టుతో వాళ్లు గెలిచారు: పాంటింగ్
- కల లాంటిది.. నిజమైనది
- ఆసీస్ మాజీలూ.. ఇప్పుడేమంటారు?
- మెగాస్టార్ పాత ఫొటో.. గందరగోళంలో రమ్యకృష్ణ!
- గబ్బా హీరోస్.. సూపర్ మీమ్స్
- ఆ విశ్వాసంతోనే వెళ్లిపోతున్నా: ట్రంప్
- యువతిని హత్యచేసిన డిల్లీబాబు ఆత్మహత్య
- మేం వస్తున్నాం.. టీమిండియా కాస్త జాగ్రత్త!
- భలే పంత్ రోజు..
- ప్రపంచమంతా సెల్యూట్ చేస్తోంది: రవిశాస్త్రి
ఎక్కువ మంది చదివినవి (Most Read)
