close

తాజా వార్తలు

Updated : 28/11/2020 07:07 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ఒక్క చుక్కేస్తే.. కిక్కే కిక్కు

విశాఖ ఏజెన్సీ నుంచి నగరానికి ‘హాషీష్‌ ఆయిల్‌’

● అంతర్రాష్ట్ర డ్రగ్స్‌ అమ్మకందారుడు

అరెస్ట్‌.. పరారీలో మరో ఇద్దరు


వివరాలు వెల్లడిస్తున్న సీపీ మహేష్‌ భగవత్‌

హైదరాబాద్‌: గంజాయి కంటే నాలుగు రెట్లు ఎక్కువ మత్తునిచ్చే ‘హాషీష్‌ ఆయిల్‌’ను విశాఖ ఏజెన్సీ నుంచి నగరానికి తరలిస్తున్న అంతర్రాష్ట్ర డ్రగ్స్‌ముఠా ప్రధాన నిందితుడిని రాచకొండ పోలీసులు అరెస్టు చేశారు. రూ.2 లక్షల విలువైన రెండు లీటర్ల హాషీష్‌ ఆయిల్‌ను శుక్రవారం స్వాధీనం చేసుకున్నారు. కేసు వివరాలను రాచకొండ సీపీ మహేష్‌ భగవత్‌ నేరెడ్‌మెట్‌లోని కమిషనరేట్‌లో మీడియాకు వెల్లడించారు.

● గంజాయి నుంచి.. సిగరెట్లలో వేసుకుని.. హాషీష్‌ ఆయిల్‌(గంజాయి నూనె)ను ఒకటి లేదా రెండు చుక్కలను సిగరెట్‌లో వేసుకుని పీల్చితే మత్తు నషాళానికంటుంది. విశాఖ ఏజెన్సీలో తయారవుతోంది. అంతర్రాష్ట్ర డ్రగ్స్‌ అమ్మకందారులు అక్కడి నుంచి నగరానికి తీసుకొస్తున్నారు. ఇక్కడికి తీసుకొచ్చాకా హాషీష్‌ ఆయిల్‌కు ఐసోప్రొపైల్‌ ఆల్కహాల్‌ను కలుపుతున్నారు. ఈ మిశ్రమాన్ని 10ఎంఎల్‌ డబ్బాల్లో నింపి.. ఒక్కోదాన్ని రూ.3వేలకు ఫుడ్‌ డెలివరీ యాప్‌ల ద్వారా వినియోగదారులకు చేరవేస్తున్నారు. శుక్రవారం పెద్దఅంబర్‌పేట్‌ ఎక్స్‌ రోడ్డు దగ్గర ఎస్వోటీ పోలీసులు ఆయిల్‌ను తరలిస్తున్న మణికొండలో నివసించే సంగారెడ్డి జిల్లా బీరంగూడకు చెందిన వీరపల్లి లక్ష్మిపతి(24)ని పట్టుకున్నారు. తదుపరి విచారణ నిమిత్తం హయత్‌నగర్‌ పోలీసులకు అప్పగించారు. బీరంగూడకు చెందిన మోహన్‌ రెడ్డి(25), అరకులోయ నివాసి నగేష్‌ పరారీలో ఉన్నట్లు సీపీ వివరించారు. ఏడీసీపీ(ఎస్వోటీ)సురేందర్‌రెడ్డి, ఇన్‌స్పెక్టర్‌ నవీన్‌ కుమార్‌ను అభినందించారు.


Tags :

క్రైమ్

జిల్లా వార్తలు
బిజినెస్‌
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
క్రైమ్
మరిన్ని