close

తాజా వార్తలు

Published : 28/11/2020 09:10 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

అడ్డుగా ఉన్నాడని హతమార్చాడు..!

●ప్రియుడి చేతిలో ప్రియురాలి భర్త హత్య

శ్రీకాకుళం : వివాహేతర సంబంధం ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. తమకు అడ్డుగా ఉన్నాడని ప్రియురాలి భర్తను హతమార్చాడు.. ప్రియుడే తన భర్తను చంపినా ఆ విషయాన్ని వడో కంటికి తెలియకుండా చేద్దామనుకుంది ఆమె. పోలీసుల విచారణలో విషయం వెలుగులోకి వచ్చింది. శ్రీకాకుళం నగరంలో గురువారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఎచ్చెర్ల మండలం ముద్దాడ గ్రామానికి చెందిన అంబటి అసిరిపోలి(35) భవన నిర్మాణ కార్మికుడిగా పని చేస్తున్నాడు. అతని భార్య కూడా కూలి పనికి వెళ్తుంటుంది. ఈమెకు సహ కార్మికుడు, గార మండలం అంపోలు గ్రామానికి చెందిన షణ్ముఖతో వడేళ్ల కిందట పరిచయం ఏర్పడింది. అది కాస్త వివాహేతర బంధంగా మారింది. విషయం అసిరిపోలికి తెలియడంతో వారి మధ్య గొడవలు జరిగేవి. గురువారం మధ్యాహ్నం శ్రీకాకుళం జీటీరోడ్డులోని ఓ భవన నిర్మాణ పనికి అసిరిపోలి, షణ్ముఖ వెళ్లారు. రెండో అంతస్తులో ఉన్న రాళ్లను తీసుకురావాలని షణ్ముఖ చెప్పడంతో ఇద్దరూ వెళ్లారు. అక్కడే అసిరిపోలిపై షణ్ముఖ ఇటుకలతో దాడి చేసి గాయపరిచాడు. అనంతరం పెనుగులాడి పక్కనే లిప్టుకోసం ఉంచిన ఖాళీ ప్రాంతంలోకి అసిరిపోలిని కిందకు తోసేయడంతో అక్కడికక్కడే మరణించాడు. విషయాన్ని షణ్ముఖ చరవాణిలో అసిరిపోలి భార్యకు చెప్పాడు. ఆమె ఏమీ తెలియనట్లు రెండో పట్టణ పోలీసుస్టేషన్‌కు వెళ్లి తన భర్త కాలుజారి పడి మృతిచెందారని ఫిర్యాదు చేసింది. దీంతో సీఐ వెంకటరమణ ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. మృతుడి తలపై కొట్టిన గాయాలుండటంతో అనుమానం వచ్చిన సీఐ వెంటనే ఆమెను, షణ్ముఖను స్టేషనుకు పిలిపించి కూపీ లాగారు. తమదైన శైలిలో విచారించగా అసలు విషయం బయటపడింది. ఘటనా స్థలాన్ని శ్రీకాకుళం డీఎస్పీ ఎం.మహేంద్ర శుక్రవారం పరిశీలించారు. క్లూస్‌టీం ఆధారాలను సేకరించింది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


Tags :

క్రైమ్

జిల్లా వార్తలు
బిజినెస్‌
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
క్రైమ్
మరిన్ని