close

తాజా వార్తలు

Published : 30/11/2020 08:24 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

భార్య చేతిలో.. భర్త హతం

భూమి పట్టాచేయడం లేదని బంధువులతో కలిసి దాడి


మృతుడు శంకర్‌నాయక్‌

ముస్తాబాద్‌, న్యూస్‌టుడే : భూమి పట్టా చేయమని మొదటి భార్య తన బంధువులతో కలిసి భర్తపై దాడిచేసిన ఘటనలో చికిత్స పొందుతూ భర్త మృతిచెందిన సంఘటన ముస్తాబాద్‌ మండలం సేవాలాల్‌తండా గ్రామపరిధిలోని పల్లెమీది తండాలో ఆదివారం వెలుగుచూసింది. పోలీసులు, గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం.. పల్లెమీది తండాకు చెందిన ధరంసోత్‌ శంకర్‌నాయక్‌ అనే వ్యక్తికి (55) మొదటి భార్య సరోజన, రెండవ భార్య రాజవ్వలు ఉన్నారు. రెండవ భార్యకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. భూమి పట్టా విషయంలో కొంతకాలంగా మొదటి భార్యకు, భర్త మధ్య గొడవలు జరుగుతున్నాయి. మొదటి భార్యకు సంతానం లేదు. భూమి తనపేరుపై పట్టా చేయని విషయాన్ని మనసులో పెట్టుకుని మొదటి భార్య సరోజన తన తమ్ముడు భానోతు శ్రీనివాస్‌, చెల్లె తేజావత్‌ లక్ష్మిని శనివారం తన ఇంటికి రప్పించింది. ముగ్గురు కలిసి భర్త శంకర్‌నాయక్‌ను ఆయన ఇంట్లోనే తీవ్రంగా కొట్టారు. దీంతో తీవ్ర గాయాలు కావడంతో మండల కేంద్రంలోని ఓ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ శంకర్‌నాయక్‌ రాత్రి మృతిచెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. మృతదేహన్ని పంచనామా నిమిత్తం సిరిసిల్ల ఏరియా ఆసుపత్రికి తరలించారు. రెండవ భార్య రాజవ్వ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేయనున్నట్లు ఇన్‌ఛార్జి సీఐ వెంకటనర్సయ్య తెలిపారు.


Tags :

క్రైమ్

జిల్లా వార్తలు
బిజినెస్‌
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
క్రైమ్
మరిన్ని