close

తాజా వార్తలు

Updated : 02/12/2020 07:52 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ప్రాయంలో తప్పులు... పసిగట్టలేక తిప్పలు..

మత్తుకు చిత్తువుతున్న కర్రకారు

ఈనాడు డిజిటల్‌, విజయవాడ

ఇంజినీరింగ్‌లో చేరగానే మంచి మార్కులతో ఇంటర్‌ విద్యను పూర్తి చేసి ఇంజినీరింగ్‌లో చేరాడు. కొంతకాలంగా ప్రవర్తనలో మార్పు రావడంతో తల్లిదండ్రులు గుర్తించారు. ఎక్కువ సమయం ఒంటరిగా గదిలో ఉండడం.. వీడియో గేమ్స్‌తో కాలక్షేపం.. కళాశాల నుంచి మధ్యలోనే వెళ్లిపోవడం వంటివి వారి దృష్టికొచ్చాయి. తండ్రి లేనప్పుడు తల్లి, సోదరిపై దురుసుగా ప్రవర్తించేవాడు. టీనేజ్‌ ప్రవర్తన అనుకుని కౌన్సెలింగ్‌కు తీసుకెళ్తే విస్తుపోయే విషయాలు వెలుగుచూశాయి. సీనియర్ల నుంచి గంజాయి, ఇతర మత్తు పదార్థాల వాడకం అలవాటైంది. పాన్‌షాపు, ఆటోవాలాల నుంచి వీరికి అందేవి. చివరికి మత్తు పదార్థాలు తానే అమ్మే స్థితికి వెళ్లిపోయాడు. అతని గదిలో వెతికితే పెద్ద మొత్తంలో మత్తు పదార్థాలు దొరికాయి.

15 ఏళ్ల అబ్బాయి...

అతను పదో తరగతి చదువువుతున్నాడు. క్రమంగా బంధువులకు దూరంగా ఉంటున్నాడు. తల్లిదండ్రులు విడిపోవడంతో అమ్మనే కష్టపడి పెంచి పెద్ద చేసింది. ఒక్కగానొక్క కొడుకు ప్రవర్తనలో మార్పు చూసి ఆమె కంగారు పడింది. మానసిక సమస్య అనుకుని కౌన్సెలింగ్‌కు తీసుకెళ్లారు. అక్కడ మాట్లాడితే విస్తుబోయే నిజాలు తెలిశాయి. క్రీడా మైదానంలో కొందరితో పరిచయం ఏర్పడింది. తన విషయాలన్నీ వారికి చెప్పుకోవడం మొదలుపెట్టాడు. అతను కూడా సరదాగా ఉంటుండడంతో నిత్యం కలవడం మొదలుపెట్టాడు. అతనికి గంజాయి తాగే అలవాటు ఉండడంతో ఈ బాలుడికి అలవాటైంది. ఈ విషయం తెలిసి తల్లి బాధ పడుతుండడంతో అబ్బాయిలో తప్పు చేశాననే భావన ఏర్పడింది. ఎవరితోనూ చెప్పుకోలేక.. అలవాటు మార్చుకోలేక తప్పు చేశాననే భావనతో లోలోపల మదనపడుతూ డిప్రెషన్‌లోకి వెళ్లిపోయాడు.

ఈ రెండు కేసుల్లోనూ పిల్లల వయసు పదిహేడేళ్లలోపే..! సహజంగా ఈ వయసులో కొందరు అత్యుత్సాహాన్ని ప్రదర్శిస్తుంటారు. కొత్త ప్రయోగాలతో ప్రమాదాలు కొనితెచ్చుకుంటుంటారు. ఈ దశలన్నీ దాటి ఇప్పుడు మత్తు పదార్థాలకు అలవాటు పడుతున్నారు. చిన్న వయసులోనే మత్తుపదార్థాలకు బానిసవుతున్నట్లు కౌన్సెలింగ్‌కు వస్తున్న వారిని బట్టి తెలుస్తోంది. ఇటీవల మాదక ద్రవ్యాలకు అబ్బాయిలు మాత్రమే బానిసయ్యేవారని భావిస్తుంటాం. అయితే విజయవాడ నగరంలో కొంత మంది అమ్మాయిలు, యువతులు ఉన్నారు. అయితే పురుషులతో పోలిస్తే ఆ నిష్పత్తి బాగా తక్కువగా ఉంటుంది. అయితే మద్యం, సిగరెట్లను తాగడంపై అమ్మాయిలూ ఆకర్షితులవుతున్నారు. ఆ తర్వాత మత్తుకు అమ్మాయిలు ఎక్కువ బాధితులు అవుతున్నారు. అనేక సమస్యల్లో చిక్కుకుంటున్నారు. ఈ ఘటనలు అమ్మాయిలు, వారి కుటుంబాల్లో ప్రతికూల ప్రభావం చూపుతున్నాయి.

ముందే అప్రమత్తత అవసరం..

యుక్త వయసులోకి వచ్చే క్రమంలో పిల్లల ప్రవర్తనపై తల్లిదండ్రులు దృష్టి పెట్టాలి.

స్నేహాలు, అలవాట్లపై ఆరా తీయాలి.

తేడా ఉంటే వెంటనే హెచ్చరించాలి.

పిల్లలతో ఎక్కువసేపు గడిపేందుకు సమయం కేటాయించాలి.

పాఠశాలల యాజమాన్యాలు సైతం బడి బయట తమకు పిల్లల ప్రవర్తన సంబంధం లేదని చేతులు దలుపుకోకుండా అవగాహన కార్యక్రమాలు చేపట్టాలి.


లోపాలు ఇవీ..!

* పిల్లలపై తల్లిదండ్రుల ప్రర్యవేక్షణ లేకపోవడం. ఉద్యోగ బాధ్యతల్లో తీరిక లేకుండా ఉండే అమ్మానాన్న తమ పిల్లలు మత్తుకు బానిస అయినట్లు ఆలస్యంగా గుర్తిస్తున్నారు.

* నిషేధిత మత్తు పదార్థాలు మార్కెట్లో సులువగా దొరుకుతున్నాయి. వీటి నియంత్రణలో యంత్రాంగం విఫలమైంది. యువత ఎక్కువగా గంజాయ్‌కు అలవాటు పడుతున్నారు.

* పోలీసులు చర్యలు చేపడుతున్నామని చెబుతున్నా వివిధ రకాల మత్తు పదార్థాలు లభ్యమవుతూనే ఉన్నాయి. అల్పాదాయ వర్గాల ప్రజలతో పాటు మధ్య తరగతి, సంపన్నవర్గాల పిల్లలూ తీసుకుంటున్నారు.


దుష్ప్రభావాలు ముందే వివరించాలి

-వి.రాధికారెడ్డి, మానసిక విభాగాధిపతి, విజయవాడ.

చిన్న వయసులోనే పిల్లలు ఉత్సుకతతో మత్తు పదార్థాల సేవనం మొదలుపెడుతున్నారు. ఆ తర్వాత దానికి బానిసలవుతున్నారు. ఇంట్లో గొడవలు, పెంపకంలో లోపాలు, తల్లిదండ్రుల్లో ఎవరికో ఒకరికి అలవాటు ఉండడం, పిల్లల్ని మత్తు పదార్థాల వైపు చూసేలా చేస్తున్నాయి. ఒకసారి బానిసైతే చాలా దుష్ప్రభావాలు ఉంటాయి. దొంగతనాలకు పాల్పడడం, దురుసు ప్రవర్తన, చివరికి డ్రగ్స్‌ అమ్మడం వరకు వెళ్లి అసాంఘిక కార్యకలాపాలతో జీవితాలు నాశనం చేసుకుంటున్నారు. డిప్రెషన్‌లోకి వెళ్లిపోతున్నారు. ముందే నివారణ చర్యలు చేపట్టడం చాలా అవసరం. పాఠశాల, కళాశాల విద్యార్థులే ఎక్కువగా బానిసలవుతున్నారు. మత్తు పదార్థాలతో కలిగే దుష్ప్రభావాలను విద్యార్థులు, యువతకు వాటికి అలవాటు పడకముందే తెలియజేయాలి.


Tags :

క్రైమ్

రాజకీయం

జనరల్‌

సినిమా

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

చిత్ర వార్తలు

మరిన్ని

దేవతార్చన