close

తాజా వార్తలు

Published : 04/12/2020 08:31 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

మళ్లీ మళ్లీ ప్రశ్నిస్తూ...

నిందితుడ్ని స్టేషన్‌కు తరలిస్తున్న పోలీసులు

భాస్కరపురం(మచిలీపట్నం),న్యూస్‌టుడే: మంత్రి పేర్ని నానిపై జరిగిన దాడియత్నం కేసుపై పోలీసులు చేపట్టిన విచారణ కొనసాగుతోంది. రెండు రోజులుగా విచారిస్తున్న వారినే పోలీసులు గురువారం స్టేషన్‌కు పిలిచి మళ్లీ విచారించారు. దాడి కేసులో నిందితుడ్ని అరెస్టు చేసి రిమాండ్‌కు పంపిన విషయం తెలిసిందే. తిరిగి విచారణ నిమిత్తం పోలీసులు తమ కస్టడీకి ఇవ్వాలని కోర్టును కోరారు. రెండు రోజులు కస్టడీకి ఇస్తూ కోర్టు ఆదేశించడంతో ఉదయం పోలీసులు పటిష్ఠ బందోబస్తు మధ్య నిందితుడ్ని బందరులోని సబ్‌జైలు నుంచి మచిలీపట్నం పోలీసుస్టేషన్‌కు తరలించి, విచారిస్తున్నారు. ఇప్పటికే తెదేపా ముఖ్య నాయకులను విచారిస్తున్న పోలీసులు మాజీ మంత్రి కొల్లు రవీంద్రకు నోటీసులు జారీ చేశారు. ఇసుక లేక అక్కసుతో దాడి చేసి ఉండొచ్చని మీడియాలో రవీంద్ర చేసిన వ్యాఖ్యలు ఏ ఆధారాలతో చేశారన్న కోణంలో ఆయన స్వగృహంలో విచారించారు. దీనిపై రవీంద్ర విలేకరులతో మాట్లాడుతూ పోలీసులు తనకు నోటీసులిచ్చి స్టేట్‌మెంట్‌ను నమోదు చేసుకున్నారని ధ్రువీకరించారు. ఇసుక లేక నిందితుడు హత్యాయత్నానికి పాల్పడ్డారని మీరు ఏ ఆధారంతో చెప్పారంటూ పోలీసులు ప్రశ్నించగా, ఘటన జరిగిన అనంతరం జిల్లా ఎస్పీ మీడియాతో మాట్లాడుతూ ఇదే అనుమానాన్ని వ్యక్తం చేయడం చూసి ఆ ఆధారాలతోనే తానూ మాట్లాడినట్లు పోలీసులకు వివరించానని రవీంద్ర చెప్పారు. గత కొన్ని రోజులుగా విచారణ పేరుతో తెదేపా నేతలను ఇబ్బంది పెడుతున్నారని అన్నారు. పోలీసులు న్యాయబద్ధంగా విచారణ జరపాలని కోరుతున్నానని తెలిపారు. నిందితుడ్ని విచారిస్తున్న పోలీసులు రెండు రోజుల్లో విచారణ పూర్తి చేసి వివరాలు వెల్లడిస్తారా, లేదా కస్టడీ గడువు పొడిగింపు కోరతారా అన్నది తెలియాల్సి ఉంది.


Tags :

క్రైమ్

రాజకీయం

జనరల్‌

సినిమా

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

చిత్ర వార్తలు

సినిమా
మరిన్ని

దేవతార్చన