close

తాజా వార్తలు

Updated : 04/12/2020 08:50 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

యువకుడి దారుణ హత్య

ప్రాణం తీసిన అక్రమ సంబంధం

యూసుఫ్‌

రాయచోటి, న్యూస్‌టుడే: ప్రియురాలి ఇంటికి వచ్చిన ప్రియుడిని భర్తతో కలిసి దారుణంగా హతమార్చిన సంఘటన రాయచోటి పట్టణం కొలిమిమిట్టలో గురువారం రాత్రి చోటు చేసుకొంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చెన్నముక్కపల్లి పంచాయతీ రాజులకాలనీకి చెందిన షేక్‌ యూసుఫ్‌(28) కొలిమిమిట్టకు చెందిన ఓ వివాహిత(26)తో మూడేళ్లుగా అక్రమ సంబంధం ఉంది. గతంలో ఈ విషయమై వివాహిత భర్త పోలీసులకు ఫిర్యాదు చేయగా కౌన్సెలింగ్‌ ఇచ్చి పంపారు. అప్పటి నుంచి కొన్ని రోజులపాటు భర్తతో కలిసి ఉంటోంది. ఈ క్రమంలో గురువారం రాత్రి యూసూఫ్‌ సదరు మహిళ ఇంటికెళ్లాడు. ఇంట్లోనే ఉన్న ఆమె, భర్త మౌలాలి ఇద్దరూ కలిసి దాడి చేసి హతమార్చారు. సమాచారం అందుకున్న పట్టణ సీఐ జి.రాజు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించారు. అక్రమ సంబంధమే ప్రాణాల మీదికొచ్చినట్లు ప్రాథమికంగా నిర్ధారించారు. యూసూఫ్‌ కుటుంబీకులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సీఐ పేర్కొన్నారు. మృతుడికి భార్య, కుమారుడు ఉన్నారు.


Tags :

క్రైమ్

రాజకీయం

జనరల్‌

సినిమా

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

చిత్ర వార్తలు

సినిమా
మరిన్ని

దేవతార్చన