హాకీ క్రీడాకారుడు ప్రవీణ్‌రావు కిడ్నాప్‌

తాజా వార్తలు

Updated : 06/01/2021 02:50 IST

హాకీ క్రీడాకారుడు ప్రవీణ్‌రావు కిడ్నాప్‌

హైదరాబాద్‌: సికింద్రాబాద్‌ బోయిన్‌పల్లిలో కిడ్నాప్‌ కలకలం సృష్టించింది. మాజీ హాకీ క్రీడాకారుడు ప్రవీణ్‌రావు, ఆయన సోదరులను దుండగులు అపహరించారు. బోయిన్‌పల్లిలోని వారి నివాసానికి ఐటీ అధికారులమంటూ మూడు కార్లలలో వచ్చిన దుండగులు..  ప్రవీణ్‌రావు, సునీల్‌రావు, నవీన్‌రావులను కిడ్నాప్‌ చేశారు. ఈ ఘటనకు సంబంధించి రామ్‌గోపాల్‌పేట ప్రాంతంలో టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు ఎనిమిది మందిని అదుపులోకి తీసుకున్నారు. ఈ కిడ్నాప్‌ను రాయలసీమ ముఠా చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. 

ప్రవీణ్‌రావు, అతని సోదరుల కిడ్నాప్‌ ఘటనపై మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ ఆరాతీశారు. దుండగులను గుర్తించే ప్రక్రియ కొనసాగుతోందని మంత్రి చెప్పారు. పోలీసులు సీసీటీవీ దృశ్యాలను పరిశీలిస్తున్నారని పేర్కొన్నారు. దుండగుల కోసం గాలించేందుకు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసినట్లు శ్రీనివాస్‌గౌడ్‌ తెలిపారు. 

ఇవీ చదవండి..
ముసుగులేసుకొచ్చి కత్తులతో దాడి
108 వాహనం ఢీకొని వ్యక్తి మృతి


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని