శరీరం 2 ముక్కలైనా..13 గంటలు ప్రాణాలతో 

తాజా వార్తలు

Updated : 08/01/2021 04:34 IST

శరీరం 2 ముక్కలైనా..13 గంటలు ప్రాణాలతో 

ఆత్మహత్య చేసుకోవాలని రైలు కింద పడ్డాడు. శరీరం రెండు ముక్కలైంది. అయినా 13 గంటల పాటు ప్రాణాలతో ఉన్నాడు. చివరకు ఆసుపత్రిలో మరణించాడు. ఈ విషాద, విస్మయ ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌ షాజహాన్‌పుర్‌ జిల్లాలో జరిగింది. హతోడా గ్రామానికి చెందిన ఓ యువకుడు పక్కనే ఉన్న రైలు పట్టాల దగ్గరకు వెళ్లి అందరూ చూస్తుండగానే రైలు కింద పడ్డాడు. అతని శరీరం రెండు ముక్కలై.. పైభాగం పక్కనే ఉన్న మురికి కాలువలో పడింది. అది చూసిన వాళ్లంతా దిగ్భ్రాంతికి గురయ్యారు. దగ్గరికెళ్లి చూసి ఆ యువకుడిని హర్షవర్ధన్‌గా గుర్తించారు. అతడు చనిపోయాడేమో అని వారు భావించారు. అయితే హర్షవర్ధన్‌ వారితో మాట్లాడటంతో విస్తుపోయారు. ఆత్మహత్య చేసుకోవాలనే ఉద్దేశంతోనే ఇలా చేసినట్లు వారితో చెప్పాడు. ఒళ్లు గగుర్పొడిచే ఆ దృశ్యాన్ని కొంతమంది తమ చరవాణుల్లో రికార్డు చేశారు. స్థానికుల సమాచారంతో ఘటన స్థలానికి చేరుకున్న రైల్వే పోలీసులు.. హర్షవర్ధన్‌ను ప్రభుత్వ వైద్య కళాశాల ఆసుపత్రికి తరలించారు. ఘటన జరిగిన 13 గంటల తర్వాత ఆ యువకుడు మరణించినట్లు చికిత్స అందించిన వైద్యురాలు పూజా పాండే తెలిపారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని