close

తాజా వార్తలు

Updated : 13/01/2021 07:52 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ప్రియుడి హత్యకేసులో ప్రియురాలి అరెస్టు 


పోలీసుల అదుపులో పావని

కొవ్వూరు పట్టణం, న్యూస్‌టుడే: మనస్పర్థలే ప్రాణం తీశాయి. రెండేళ్లుగాప్రియుడిలో మార్పు రాకపోవడంతో క్రమంగా ఆమెలో ద్వేషం పెరిగింది. దాంతో ప్రణాళిక ప్రకారం హత్యకు పూనుకొంది. తాడేపల్లిగూడేనికి చెందిన అంబటి కరుణ తాతాజీనాయుడు (25)ను మలకపల్లికి చెందిన యువతి గర్సికూటి పావని సోమవారం రాత్రి కత్తితో పొడిచి చంపిన విషయం తెలిసిందే. కొవ్వూరు మండలం కాపవరం- ధర్మవరం గ్రామాల మధ్య జరిగిన ఈ దుర్ఘటన సంచలనం రేకెత్తించింది. ద్విచక్రవాహనంపై వెనుక కూర్చుని వీపుపై కత్తితో తాతాజీని పొడవడం, అతను కింద పడిపోగానే మెడ, తలపై పొడిచిన తీరు సర్వత్రా చర్చనీయాంశమైంది. డిగ్రీ మూడో సంవత్సరం చదువుతున్న పావని గతంలో కొన్నాళ్లు తాడేపల్లిగూడెంలో ఉన్నారు. ఆ సమయంలో తాతాజీతో ప్రేమలో పడింది. కొన్నాళ్లు బాగానే ఉన్నా రెండేళ్లుగా వారి మధ్య విభేదాలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో పావని తిరిగి మలకపల్లి వచ్చేసింది. ఆ సమయంలో ఇద్దరి ఇళ్లలోనూ మనస్పర్థలు వచ్చాయి. తాజాగా పంగిడి వచ్చిన తాతాజీని పావని కలిసింది. ఆమెను మలకపల్లిలో దింపేందుకు వెళుతుండగా తనతోపాటు తెచ్చుకున్న కత్తితో పొడిచింది. ఈ సందర్భంగా గ్రామీణ సీఐ ఎం.సురేష్‌ మాట్లాడుతూ రెండేళ్ల కిందట తాతాజీ రహస్యంగా తాళి కట్టాడని, బహిరంగంగా పెళ్లి చేసుకోవాలని కోరినట్లు పావని తెలిపిందన్నారు. ఈ క్రమంలో ఒకరిపై ఒకరు కోపం, అనుమానం పెంచుకున్నట్లు తెలుస్తోందన్నారు. హత్య కేసుగా నమోదు చేసి పావనిని అరెస్టు చేశామని, తాతాజీ మృతదేహాన్ని పరీక్ష నిమిత్తం కొవ్వూరు తరలించామని చెప్పారు.

తాతాజీనాయుడు (పాతచిత్రం)

బ్యాగులో మరో కత్తి

హత్యకు వినియోగించిన కత్తి ఘటన స్థలంలో లభించగా పావని బ్యాగులో పోలీసులకు మరో కత్తి దొరికింది. అయితే తాతాజీని పొడిచిన తర్వాత బ్యాగులో ఉన్న కత్తితో పావని పొడుచుకునేందుకు యత్నించగా స్థానికులు వారించినట్లు తెలుస్తోంది. ఈ విషయమై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అలాగే హత్య చేసిన అనంతరం తాతాజీ కుటుంబ సభ్యులకు అతని చరవాణితో ఆమె సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇద్దరి చరవాణుల్లో కాల్‌డేటాను పోలీసులు పరిశీలిస్తున్నారు. తాడేపల్లిగూడెం నుంచి తాతాజీ తల్లిదండ్రులు, బంధువులు మంగళవారం ఘటన స్థలానికి చేరుకుని కన్నీటి పర్యంతమయ్యారు. ‘వీరిద్దరూ ప్రేమించుకుంటున్న విషయం తమకు తెలియదని, గతంలో పావని కుటుంబ సభ్యులు మా ఇంటికొచ్చి హెచ్చరించారని, అప్పట్నుంచి ఆమె జోలికి పోలేదని, ఇలా చంపేస్తారని ఊహించలేదు’అని తాతాజీ తండ్రి మల్లేశ్వరరావు వాపోయారు.


Tags :

క్రైమ్

జిల్లా వార్తలు
బిజినెస్‌
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
క్రైమ్
మరిన్ని