
తాజా వార్తలు
ఉద్యోగం పేరిట రోగిని విక్రయించిన వైద్యుడు
తాహేరాబేగం
గోల్కొండ, న్యూస్టుడే: తన ఆసుపత్రికి చికిత్స కోసం వచ్చే రోగిని కువైట్లో ఉద్యోగం పేరిట రూ.2లక్షలకు విక్రయించాడో వైద్యుడు. పోలీసుల కథనం ప్రకారం... టోలిచౌకి సమతా కాలనీకి చెందిన తాహేరాబేగం (40) ఆరోగ్య రీత్యా గోల్కొండ కోటోరా హౌస్ వద్ద ఉన్న షిఫా క్లినిక్ వైద్యుడు షబ్బీర్హుస్సేన్ వద్దకు వచ్చేది. ఈ క్రమంలో కువైట్లో ఓ ఇంట్లో పని మనిషిగా చేరితే నెలకు రూ.25వేలు సంపాదించవచ్చని తెలిపాడు. తన కుమార్తె వివాహ నిమిత్తం అప్పుల్లో ఉన్న తాహేరాబేగం అందుకు అంగీకరించింది. గతేడాది ఫిబ్రవరి 3న ఆమె కువైట్కు పయనమైంది. అక్కడ షబ్బీర్హుస్సేన్ తమ్ముడు తాహేరాబేగంను కలవాగా అల్ షమారీ అనే వ్యక్తి ఇంట్లో పనిలో కుదిర్చాడు. కొద్ది రోజులుగా అల్షమారీ తాహేరాబేగంకు తినేందుకు సరైన ఆహారం సైతం ఇవ్వడం లేదు. దీంతో తాహేరాబేగం తనను తిరిగి ఇండియాకు పంపాలని అల్షమారీని వేడుకోగా షబ్బీర్హుస్సేన్కు రూ.2లక్షలు చెల్లించి ఆమెను కొనుగోలు చేసినట్లు తెలిపాడు. ఈ విషయాన్ని తాహేరాబేగం తన కుమార్తె తరన్నుం బేగంకు చెప్పి విలపించింది. ఆమె విషయాన్ని ఎంబీటీ నేత అమ్జదుల్లాఖాన్ దృష్టికి తెచ్చింది.