close

తాజా వార్తలు

Updated : 16/01/2021 09:28 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

నగదు కోసం భార్యను హతమార్చాడు

వరలక్ష్మి (పాత చిత్రం)

తణుకు, న్యూస్‌టుడే: నగదు కోసం భార్య గొంతు కోసి హతమార్చిన సంఘటన తణుకు మండలం దువ్వ గ్రామంలో గురువారం ఉదయం చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం నారాయణపురం గ్రామానికి చెందిన కొండపాటూరి వరలక్ష్మి(31)కి పదేళ్ల కిందట కృష్ణా జిల్లా ముస్తాబాద్‌ సావరగూడేనికి చెందిన రత్నాకరరావుతో వివాహమైంది. వీరికి గీతామాధురి అనే తొమ్మిదేళ్ల కుమార్తె ఉంది. రత్నాకరరావు రెండేళ్ల కిందట మృతిచెందాడు. తణుకు మండలం దువ్వ గ్రామంలో ఉంటున్న పెద్దమ్మ వెంకటరమణమ్మ వరలక్ష్మికి తాడేపల్లిగూడెం మండలం దండగర్రకు చెందిన పచ్చల శ్రీనుతో ఏడాదిన్నర కిందట పెళ్లి చేసింది. శ్రీను ఆటోపై ఉల్లిపాయలను విక్రయిస్తుంటాడు. శ్రీనుకు గతంలో వివాహమైంది. భార్య వదిలేసి ఉపాధి నిమిత్తం ఇతర దేశానికి వెళ్లింది. వరలక్ష్మి మొదటి భర్తకు ఆస్తి ఉండటంతో గీత మాధురి పేరున రూ.5 లక్షలు డిపాజిట్‌ చేశారు. ఆ సొమ్ము తీసుకురావాలని శ్రీను నిత్యం గొడవ పడుతుండటంతో వరలక్ష్మి బ్యాంకు నుంచి రూ.4 లక్షలు తీసుకొచ్చి ఇచ్చింది. భార్య ఇచ్చిన సొమ్మును జల్సాలకు ఖర్చు చేశాడు. తన కుమార్తె పేరున ఉన్న నగదు తీసుకొని ఆమెకు ఆధారం లేకుండా చేశాడని వరలక్ష్మి గ్రామ పెద్దల దృష్టికి తెచ్చింది. ఆ సొమ్ములో కనీసం రూ.లక్ష కుమార్తె బ్యాంకు ఖాతాలో వేయాలని పెద్దలు సూచించడంతో శ్రీను అంగీకరించాడు. కానీ ఆ సొమ్మును వేయలేదు. అంతేకాకుండా నిత్యం మద్యం తాగి వచ్చి భార్యతో ఘర్షణకు దిగేవాడు. దీంతో వరలక్ష్మి పది రోజుల కిందట దువ్వ వయ్యేరు కాలువ సమీపంలో ఉంటున్న తన పెద్దమ్మ వద్దకు వచ్చి ఉంటోంది. గురువారం ఉదయం భార్యతో చరవాణిలో మాట్లాడిన శ్రీను ఆమె పెద్దమ్మ ఇంటి వద్ద లేరని తెలుసుకున్నాడు. కత్తి తీసుకుని భార్య వద్దకు వచ్చి పొడిచి గొంతు కోసి పరారయ్యాడు. స్థానికులు 108కి సమాచారం ఇవ్వడంతో అప్పటికే మృతి చెందినట్లు సిబ్బంది గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన ప్రాంతాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ఎన్‌.శ్రీనివాసరావు తెలిపారు. మృతదేహానికి స్థానిక జిల్లా కేంద్ర ఆసుపత్రిలో శుక్రవారం పంచనామా నిర్వహించి ఆమె బంధువులకు అప్పగించామని వెల్లడించారు.



Tags :

క్రైమ్

జిల్లా వార్తలు
బిజినెస్‌
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
క్రైమ్
మరిన్ని