close

తాజా వార్తలు

Published : 18/01/2021 07:31 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

గొంతు కోసి కడతేర్చారు


శ్రీను (పాత చిత్రం)

పెద్దదోర్నాల: దోర్నాల మండలం తిమ్మాపురంలోని పీర్లచావిడి వద్ద ఓ యువకుడు దారుణ హత్యకు గురైన సంఘటన శనివారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. ఆ గ్రామానికి చెందిన మండ్ల రంగయ్య, వెంకట లక్ష్మమ్మల మూడో కుమారుడు శ్రీను(22). అతను శనివారం రాత్రి పీర్లచావిడి వద్ద ఉన్నారు. అతని సోదరుడు వెంకటేశ్వర్లు ఇంటికి రమ్మని పిలవడంతో తాను తర్వాత వస్తానని చెప్పి అక్కడే ఉండిపోయారు. ఆదివారం వేకువజామున పీర్లచావిడి సమీపంలో ఉన్న నీటి ట్యాంకు వద్దకు వచ్చిన కొందరు రక్తపుమడుగులో పడి ఉన్న శ్రీను మృతదేహాన్ని చూసి తల్లిదండ్రులకు సమాచారం అందించారు. తల్లిదండ్రులు, బంధువులు, గ్రామస్థులు హుటాహుటిన సంఘటనా స్థలం వద్దకు చేరుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. పరిసర ప్రాంతాల్లోని వారిని విచారించారు. ఒంగోలు నుంచి క్లూస్‌టీం సిబ్బంది, డాగ్‌ స్క్వాడ్‌ వచ్చి పరిశీలించారు. గుర్తు తెలియని వ్యక్తులు రాత్రి పూట మద్యం తాగి గొంతు కోసి కడతేర్చి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. గ్రామనడిబొడ్డున ఈ దారుణ హత్య చోటుచేసుకోవడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు.



Tags :

క్రైమ్

జిల్లా వార్తలు
బిజినెస్‌
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
క్రైమ్
మరిన్ని