
తాజా వార్తలు
ప్రేమోన్మాదికి యావజ్జీవ శిక్ష
వెంకట్
ఉస్మానియా యూనివర్సిటీ, న్యూస్‌టుడే: ప్రేమోన్మాదంతో యువతిని కిరాతకంగా గొంతు కోసి హత్య చేసిన యువకుడికి యావజ్జీవ కారాగార శిక్ష పడింది. ఓయూ ఠాణా ఇన్స్పెక్టర్ రమేష్‌నాయక్ వివరాల ప్రకారం.. వారాసిగూడకు చెందిన ఆరెపల్లి వెంకట్(25), బౌద్ధనగర్ ప్రాంతానికి చెందిన యువతిని ప్రేమోన్మాదంతో 2018 ఆగస్టు 7న ఆర్ట్స్ కళాశాల రైల్వేస్టేషన్ పక్కన గల పోలీస్ క్వార్టర్స్‌లో గొంతుకోసి హత్య చేశాడు. విచారణ అనంతరం బుధవారం నాంపల్లిలోని రెండో అదనపు మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జి.. ముద్దాయికి జీవిత ఖైదుతోపాటు రూ.10 వేల జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించారు. కేసును అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ జి.నారాయణ వాదించారు.
Tags :