
తాజా వార్తలు
సినీనటుడు విశ్వంత్కు నోటీసులు
జూబ్లీహిల్స్, న్యూస్టుడే: ‘కేరింత’ చిత్ర నటుడు విశ్వంత్కు కారు మోసం కేసులో బంజారాహిల్స్ పోలీసులు నోటీసులు జారీ చేశారు. తక్కువ ధరకు ఖరీదైన కారు ఇప్పిస్తామని మోసగించిన సంఘటనలో విశ్వంత్తో పాటు అతని తండ్రి లక్ష్మీకుమార్ అలియాస్ సాయిబాబా, స్పేస్ టైమ్ ఇంటీరియర్ నిర్వాహకుడు ఆత్మకూరి ఆకాశ్గౌడ్పై బంజారాహిల్స్ ఠాణాలో కేసు నమోదైన విషయం విధితమే. కాగా ఈ కేసులో నిందితుడిగా ఉన్న విశ్వంత్కు 41ఎ సీఆర్పీసీ కింద నోటీసులు జారీ చేసినట్లు బంజారాహిల్స్ ఇన్స్పెక్టర్ కళింగరావు తెలిపారు.
Tags :