close

తాజా వార్తలు

Published : 02/03/2021 07:34 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

భార్యతో గొడవ.. బ్లేడుతో గొంతు కోసుకున్న భర్త

గాయపడిన వెంకటేష్‌

జూబ్లీహిల్స్‌: భార్యతో గొడవ పడి మద్యం మత్తులో బ్లేడుతో ఓ వ్యక్తి గొంతు కోసుకున్న సంఘటన జూబ్లీహిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకొంది. జూబ్లీహిల్స్‌ పోలీసుల కథనం ప్రకారం.. శ్రీకృష్ణనగర్‌లో నివసించే వెంకటేష్‌(36) మేస్త్రిగా పనిచేస్తుంటాడు. కొంతకాలంగా పనికి వెళ్లకుండా నిత్యం మద్యం తాగుతున్నాడు. ఈ నేపథ్యంలోనే భార్య సూర్యకుమారి ఇళ్లలో పనిచేస్తూ కుటుంబాన్ని వెళ్లదీస్తోంది. మరోవైపు వెంకటేష్‌ మద్యానికి బానిసై అప్పులు కూడా చేస్తుండటంతో భార్యభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి. సోమవారం ఉదయం సైతం ఇద్దరి మధ్య గొడవ జరిగింది. ఏదైనా పని చేయవచ్చు కదా అని సూచించిన భార్యను వెంకటేష్‌ కొట్టడానికి వెళ్లాడు. దీంతో గొడవ పెరిగి పెద్దదైంది. భార్య పనికి వెళ్లగా అప్పటికే మద్యం మత్తులో ఉన్న వెంకటేష్‌ బ్లేడుతో మూడునాలుగు సార్లు గొంతు కోసుకున్నాడు. దీంతో తీవ్ర రక్తస్రావం జరిగింది. ఇది గమనించిన స్థానికులు వెంటనే పోలీసుకు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న పోలీసులు వెంకటేష్‌ను యశోద ఆసుపత్రికి తరలించారు. అతడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.



Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని