ఈత నేర్పిస్తామని.. చెరువులోకి నెట్టేశారు!

తాజా వార్తలు

Updated : 05/04/2021 05:08 IST

ఈత నేర్పిస్తామని.. చెరువులోకి నెట్టేశారు!

నీటిలో గల్లంతైన యువకుడు శ్రీను

ఘట్‌కేసర్‌: ఆ ముగ్గురు యువకులు స్నేహితులు.. ఎక్కడికి వెళ్లాలన్నా.. ఏ పని చేయాలన్న కలిసి చేసేవారు. అప్పటి వరకు సరదాగా గడిపి చెరువులో ఈత కోసం వెళ్లి ఒకరు గల్లంతయ్యారు. సీఐ ఎన్‌.చంద్రబాబు తెలిపిన వివరాల ప్రకారం.. దమ్మాయిగూడకు చెందిన బండారి పోచయ్య(26), ఘట్‌కేసర్‌ బాలాజీనగర్‌కు చెందిన వి.గోపి(26) బి.శ్రీను(25) స్నేహితులు. దినసరి కూలీలుగా పని చేస్తారు. ఆదివారం మధ్యాహ్నం ఘట్‌కేసర్‌లో ముగ్గురూ మద్యం సేవించారు. ఎండ వేడికి చెరువులో ఈత కొట్టాలని అనుకున్నారు. శ్రీను తనకు ఈత రాదని చెప్పినా.. కొండాపూర్‌లోని కాసారం వద్దకు తీసుకెళ్లారు. పోచయ్య, గోపి అందులోకి దిగారు. శ్రీను ఒడ్డుపై ఉండటంతో ఈత నేర్పిస్తామని చెప్పి బలవంతంగా నెట్టేశారు. దీంతో ఒకసారిగా శ్రీను మునిగిపోయి కనిపించకుండా పోయాడు. భయపడిన ఇద్దరు సాయంత్రం 5 గంటల ప్రాంతంలో ఘట్‌కేసర్‌ ఠాణాకు వెళ్లి జరిగిన విషయం చెప్పారు. పోలీసులు గల్లంతైన యువకుడి కోసం గాలిస్తున్నారు. ఈమేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ పేర్కొన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని