close

తాజా వార్తలు

Updated : 07/04/2021 07:04 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

భర్త హత్యలో భాగస్వామి

నిందితుడు, మృతుడి భార్య అరెస్టు

రుబీనా, సయ్యద్‌ మహమ్మద్‌ అలీ

జూబ్లీహిల్స్‌, న్యూస్‌టుడే: భర్తకు నలభై ఏళ్లు.. ఆమెకు పాతికేళ్లు.. ప్రియుడికి ఆమె కంటే మూడేళ్లు చిన్న వయసు.. వివాహేతర సంబంధం కోసం ఇవన్నీ మరిచిపోయింది.. కుటుంబ బంధాన్ని కాదనుకొని అనైతిక సంబంధం మోజులో పడింది. ఇంకేముంది.. భర్తను హత్యచేసే పథక రచనలో ఆమె కూడా భాగమయ్యింది. చివరికి హత్య కేసులో నిందితురాలిగా జైలుకెెళ్లింది. జూబ్లీహిల్స్‌ ఠాణా పరిధిలోని కార్మికనగర్‌లో జరిగిన ఈ హత్య వివరాలను పశ్చిమ మండల డీసీపీ ఏఆర్‌ శ్రీనివాస్‌ వివరించార. నిందితులుగా సయ్యద్‌ మహమ్మద్‌ అలీ(22), మృతుడి భార్య రుబీనా(25)ను అరెస్ట్‌ చేసినట్లు తెలిపారు.

ఇదీ జరిగింది...

ఈ నెల 30న కార్మికనగర్‌లోని ఓ అపార్ట్‌మెంట్‌లో నివసించే టైలర్‌ మహ్మద్‌ సిద్దిఖ్‌ అహ్మద్‌(40) హద్యోదంతం కలకలం రేపింది. పోలీసులు విచారించగా సిద్దిఖ్‌ భార్య రుబీనాకు వివాహేతర సంబంధం ఉన్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. దీంతో సయ్యద్‌ మహమ్మద్‌ అలీ అనే యువకుడిని అనుమానించి సాంకేతికంగా గుర్తించి ఈ నెల 5న అదుపులోకి తీసుకొని విచారించారు. రుబీనాతో రెండేళ్లుగా వివాహేతర సంబంధం ఉన్నట్లు అతడు అంగీకరించాడు. ఏడాదిన్నర కిందట ఫ్లాట్‌లో సిద్దిఖ్‌కు వీరిద్దరు దొరికారు. అతడు అలీని కొట్టడంతోపాటు బెదిరించాడు. అప్పటి నుంచి భార్య రుబీనాను వేధించడం ప్రారంభించాడు. విషయం తెలుసుకున్న అలీ తమకు అడ్డుగా ఉన్న సిద్దిఖ్‌ను చంపాలని నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలోనే మార్చి 28న రుబీనా తన పిల్లలతో సోదరుల ఇంటికి వెళ్లింది. అదే నెల 30న రాత్రి ఇంట్లో సిద్ధిఖ్‌ ఒంటరిగా ఉన్నట్లు రుబీనా అలీకి చెప్పింది. రాత్రి 2 గంటల సమయంలో సిద్ధిఖ్‌ ఇంటికి వెళ్లిన అలీ నిద్రలో ఉన్న సిద్దిఖ్‌ తలపై ఇనుపరాడ్‌తో బలంగా కొట్టి చంపేశాడు. మృతదేహాన్ని ఫ్రిజ్‌లో పెట్టడానికి ప్రయత్నించి పట్టకపోవడంతో తల భాగానికి బనీన్‌ కట్టి ఫ్రిజ్‌లో పెట్టాడు. అనంతరం మృతుడి బైక్‌పైనే బోరబండలో విజేత థియేటర్‌ సమీపంలోని ఓ కాలువలో రాడ్‌ను విసిరేసి పరారయ్యాడు. హత్య సమయంలోనూ అలీ, రుబీనాలు ఫోన్‌ మాట్లాడారని డీసీపీ తెలిపారు. కేసును ఛేదించిన జూబ్లీహిల్స్‌ పోలీసులను ఆయన అభినందించారు.



Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని