అసలు చూపి నకిలీ బంగారంతో మస్కా
close

తాజా వార్తలు

Updated : 19/04/2021 04:49 IST

అసలు చూపి నకిలీ బంగారంతో మస్కా

బెంగళూరు కేంద్రంగా కొత్త తరహా మోసం


నిందితులు తమకు దొరికినవిగా చూపే నకిలీ బంగారు నాణేలు

మంచిర్యాలనేరవిభాగం, న్యూస్‌టుడే: ప్రస్తుతం ఆన్‌లైన్‌ మోసాలతో పాటు రోజుకో కొత్త తరహా నేరాలు జరుగుతున్నాయి. కొద్దిరోజులుగా ఉమ్మడి ఆదిలాబాద్‌తో పాటు కరీంనగర్‌ జిల్లాలో ఓ ముఠా సంచరిస్తోంది. పట్టణాల్లో తిరుగుతూ మొదట స్థానికంగా ఉండే వ్యాపారులతో పరిచయం పెంచుకుంటారు. వారు పూర్తిగా నమ్మిన తర్వాత తమకు తెలిసిన వ్యక్తి జేసీబీతో భూమి చదును చేసే క్రమంలో బంగారు నగలు దొరికాయని చరవాణులలో ఫొటోలను పంపిస్తారు. వీటిని మార్కెట్‌లో ఉన్న బంగారం ధరలో సగానికే విక్రయించాలనుకుంటున్నామని వారితో బేరసారాలకు దిగుతారు. వీరి మధ్య సయోధ్య కుదిరితే బెంగళూరు రావాలని కోరుతారు. వారిని నమ్మించేందుకు నిందితులు మొదట అసలు బంగారు నగలనే వారికి ఇచ్చి పరీక్ష చేసుకోమంటారు. వీరు వాటిని పరీక్షించి నిజమైన బంగారమే కావడంతో పూర్తిగా నమ్ముతారు. నగలను తీసుకువచ్చేందుకు బెంగళూరు వెళ్లిన వ్యాపారులకు నిందితులు అసలు బంగారం నగలను పోలిన నకిలీవి ముట్టచెబుతున్నారు. తీరా నగలను తీసుకువచ్చిన తర్వాత పరీక్షిస్తే తాము మోసపోయామని కన్నీరుమున్నీరవుతున్నారు. ఇటీవల మంచిర్యాల జిల్లాకేంద్రానికి చెందిన ఓ వ్యాపారి నగల కోసమై రూ.15 లక్షలు నిందితులకు ముట్జజెప్పారు. ఇదే తరహాలో జగిత్యాలలో కూడా ఓ వ్యక్తి మోసపోయారు. తాము ఆశపడి మోసపోయిన తీరుతో పోలీసులకు ఫిర్యాదు ఇస్తే మార్కెట్‌లో తమకున్న విలువ పోతుందని వాపోతున్నారు. ఈ ముఠా ఇప్పటికే పదిమందికి పైగా బంగారు నగల ఆశ చూపినప్పటికీ వారి వలలో కొందరే పడినట్లు తెలుస్తోంది. ఈ ముఠాపై పోలీసులు ప్రత్యేక దృస్టిసారిస్తే కొత్త తరహా మోసాలకు అడ్డుకట్ట వేసినట్లవుతుంది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని