భార్య కాపురానికి రావడం లేదని ఆత్మహత్య
close

తాజా వార్తలు

Updated : 20/04/2021 07:33 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

భార్య కాపురానికి రావడం లేదని ఆత్మహత్య

 

గజ్వేల్‌ గ్రామీణ, న్యూస్‌టుడే: భార్య కాపురానికి రావడం లేదని ఆందోళన చెందిన సాఫ్ట్‌వేర్‌ ఇంజినీరు ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన సోమవారం గజ్వేల్‌ పట్టణంలో చోటు చేసుకుంది. గజ్వేల్‌ అదనపు సీఐ వెంకటేశ్వర్లు తెలిపిన వివరాలు.. పట్టణానికి చెందిన పోతిరెడ్డి జీవన్‌రెడ్డి (30)కి గత ఏడాది డిసెంబరులో మహబూబ్‌నగర్‌ చెందిన కొమ్మారెడ్డి ప్రవళికతో వివాహం అయింది. లాక్‌డౌన్‌ నేపథ్యంలో అతను గజ్వేల్‌లో ఉంటూ ఇంటి వద్దనుంచే కంపెనీ పనులు చేస్తున్నాడు. పెళ్లి అయిన వారం రోజులకే ప్రవళిక పుట్టింటికి వెళ్లిపోగా ఎన్నిసార్లు రమ్మని చెప్పినా ఆమె రావడం లేదు. తనకు ఇష్టం లేని పెళ్లి చేశారని అందుకే తాను మీ ఇంటికి రానని చెప్పడంతో మనస్తాపం చెందాడు. ఈ నేపథ్యంలో సోమవారం ఉదయం జీవన్‌రెడ్డి తన గదిలోకి వెళ్లి గడియ వేసుకుని ఉరి వేసుకున్నాడు. అంతకుముందు తన చరవాణిలో భార్య కాపురానికి రావడం లేదనే మనస్తాపంతో ఉరి వేసుకుంటున్నానని వీడియో రికార్డు చేసి తల్లి సుందరి, ఇతర బంధువులకు పంపించాడు. వీడియోను చూసిన తల్లి వెంటనే బంధువుల సాయంతో తలుపును పగులగొట్టి గదిలోకి వెళ్లగా ఫ్యాన్‌కు ఉరి వేసుకుని కనిపించిన జీవన్‌రెడ్డిని కిందకు దింపి గజ్వేల్‌ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే అతను మృతి చెందినట్లు ధ్రువీకరించారు. తల్లి సుందరి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని