close

తాజా వార్తలు

Updated : 21/04/2021 04:36 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ప్రేమించిన వ్యక్తితో కూతురు వెళ్లిపోయిందని...

మనస్తాపంతో దంపతుల ఆత్మహత్య


నారాయణ                         రాజేశ్వరి

సంగారెడ్డి అర్బన్‌, కంది, న్యూస్‌టడే: చిన్ననాటి నుంచి కూతురును అల్లారుముద్దుగా చూసుకుని... ఆమె భవిష్యత్తుపై ఎన్నో ఆశలు పెంచుకున్న ఆ తల్లిదండ్రులు కూతురు తీసుకున్న నిర్ణయంతో హతాశులయ్యారు. తమ పరువుకు భంగం కలిగిందని ఆవేదనకు గురయ్యారు. తాము బతికి ఉండి ప్రయోజనమేమని, చివరకు మంగళవారం భార్యాభర్తలిద్దరు ఒకే తాడుతో చెట్టుకు ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడిన ఘటన సంగారెడ్డి జిల్లా కంది మండలం శివారులోని కైలాష్‌ గార్డెన్‌ ఆవరణలో చోటుచేసుకుంది. గ్రామీణ సీఐ శివలింగం తెలిపిన ప్రకారం... అల్లాదుర్గం మండలం గడిపెద్దాపూర్‌ గ్రామానికి చెందిన పల్లకొండ నారాయణ(45), ఆయన భార్య రాజేశ్వరి(40) కొన్నాళ్లుగా కందిలో నివాసం ఉంటున్నారు. 1995కు బ్యాచ్‌కు చెందిన కానిస్టేబుల్‌ నారాయణ గతంలో సంగారెడ్డి ఠాణాలో, ప్రస్తుతం జిన్నారంలో విధులు నిర్వహిస్తున్నారు. ఆయనకు ఇద్దరు కూతుళ్లు. పెద్ద కూతురు నిహారికకు పెళ్లి నిశ్చయమైంది. ఈ వివాహం ఇష్టంలేని సదరు యువతి రెండు రోజుల కిందట మరో వ్యక్తితో వెళ్లిపోయింది. ఈ విషయం తెలుసుకున్న నారాయణ విధులకు సెలవు పెట్టి ఇంటికొచ్చారు. ఈ సంఘటనతో భార్యాభర్తలిద్దరు తీవ్రంగా కుమిలిపోయారు. పెళ్లి కుదిరాక కూతురు ఎక్కడికో వెళ్లిపోయిందని, ఈ విషయం బంధువుల్లో తెలిస్తే పరువు పోతుందని ఆ దంపతులు మదనపడ్డారు. వీటన్నింటికి పరిష్కారం తమ చావేనని భావించి క్షణికావేశంలో దంపతులు ఒకే తాడుతో చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. సమాచారం తెలుసుకున్న అదనపు ఎస్పీ సృజన, డీఎస్పీ బాలాజీ ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. మృతదేహాలను జిల్లా కేంద్ర ఆసుపత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నట్లుగా సీఐ వెల్లడించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని