close

తాజా వార్తలు

Updated : 22/04/2021 07:57 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

పెళ్లి చూపులకు వెళ్లొస్తూ పరలోకాలకు..

ఇద్దరు యువకుల దుర్మరణం


సత్యనారాయణ (పాత చిత్రం)

హనుమాన్‌జంక్షన్‌, న్యూస్‌టుడే: శ్రీరామ నవమి రోజున హనుమాన్‌జంక్షన్‌ వద్ద 16వ జాతీయ రహదారి నెత్తురోడింది. ద్విచక్ర వాహనం అదుపు తప్పి డివైడర్‌ని ఢీకొట్టడంతో ఇద్దరు యువకులు తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే దుర్మరణం చెందారు. లయన్స్‌ క్లబ్‌ సమీపంలో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. శ్రీకాకుళం జిల్లా సంతకవిటి మండలం వాసుదేవపట్నానికి చెందిన బూరాడ సత్యనారాయణ(24) విజయవాడలో ఓ ప్రైవేటు బ్యాంకులో ఉద్యోగం చేస్తూ రాజుల బజారులోని అంకాలమ్మ గుడి వద్ద నివసిస్తున్నాడు. పెళ్లిచూపుల నిమిత్తం గుణదలకు చెందిన స్నేహితుడు బేతాళ యశోదకృష్ణ(25)తో కలిసి ఇటీవల ద్విచక్ర వాహనంపై స్వస్థలానికి వెళ్లాడు. మంగళవారం రాత్రి ఏడు గంటల సమయంలో తిరిగి విజయవాడకు బయలుదేరారు. బుధవారం ఉదయం ఆరు గంటల సమయంలో హనుమాన్‌జంక్షన్‌ చేరుకున్న వీరు లయన్స్‌ క్లబ్‌ దాటుతుండగా, అదుపుతప్పి జాతీయ రహదారిపై ఉన్న డివైడర్‌ని ఢీకొట్టారు. ఈ క్రమంలోనే ద్విచక్ర వాహనంపై నుంచి ఎగిరి డివైడర్‌ మధ్యలో ఉన్న ఇనుప రెయిలింగ్‌పై పడ్డారు. దీంతో ఇరువురి తలలకు బలమైన గాయాలయ్యాయి. సత్యనారాయణ తల ఛిద్రమై మెదడు బయటకు వచ్చేసింది. ఇద్దరూ ఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదం జరగడానికి కొద్దిసేపటి ముందు సత్యనారాయణ, బస్సులో వెళుతున్న సోదరి పూడివలస రాజేశ్వరితో చరవాణిలో మాట్లాడినట్లు తెలిసింది. గంటలో తాము విజయవాడలో ఉంటామని, మీరు బస్సు దిగి నేరుగా ఇంటికి వెళ్లిపోమని చెప్పినట్లు సమాచారం. మృతదేహాలను శవ పరీక్షల నిమిత్తం కృష్ణా జిల్లా నూజివీడు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై చంటిబాబు తెలిపారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని