close

తాజా వార్తలు

Updated : 22/04/2021 05:42 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

మూడోసారి ట్రాన్స్‌ఫార్మర్‌ ఎక్కాడు

నిజామాబాద్‌ నేరవార్తలు: భార్య కాపురానికి రాకపోతే ఏం చేస్తాం? మహా అయితే కుటుంబ పెద్దలతో మాట్లాడుకొంటాం. అత్తింటికి వెళ్లి పంచాయితీ పెడతాం. ఇలా కూడా సమస్య పరిష్కారం కాకపోతే పోలీసుల వరకు వెళ్తాం. కానీ, నిజామాబాద్‌లో ఓ వ్యక్తి మాత్రం ట్రాన్స్‌ఫార్మర్‌ ఎక్కి కలకలం సృష్టిస్తున్నాడు. ఆరు నెలల్లో మూడుసార్లు ట్రాన్స్‌ఫార్మర్‌ ఎక్కాడు. అటు పోలీసులను, ఇటు కుటుంబీకులను తిప్పలు పెడుతున్నాడు.
డిచ్‌పల్లి మండలం ధర్మారం గ్రామానికి చెందిన రవికి ఇద్దరు భార్యలు. ఈ విషయమై కుటుంబంలో గొడవలు నడుస్తున్నాయి. ఓ భార్య కాపురానికి రావట్లేదని ఆరు నెలల క్రితం మహిళా ఠాణా ఎదుట ఉన్న ట్రాన్స్‌ఫార్మర్‌ ఎక్కి హల్‌చల్‌ చేశాడు. ఆ తర్వాత పోలీసులు అతన్ని కిందకు దింపి సమస్య పరిష్కరించారు. తిరిగి నెల కిందట మూడో ఠాణా ఎదుట ట్రాన్స్‌ఫార్మర్‌ ఎక్కాడు. ఆ వెంటనే పోలీసు సిబ్బంది ఇతన్ని రక్షించి ఆత్మహత్యాయత్నం కింద కేసు నమోదు చేశారు. మళ్లీ ఇదే వ్యక్తి బుధవారం మూడో ఠాణా వద్ద ఉన్న ట్రాన్స్‌ఫార్మర్‌ ఎక్కాడు. సమాచారం అందుకొన్న ఎస్సై సంతోష్‌ కుమార్‌ అతన్ని కిందకు దింపి అదుపులోకి తీసుకొన్నారు. రవిపై మరోమారు ఆత్మహత్యాయత్నం కేసు నమోదు చేశారు. పదేపదే ట్రాన్స్‌ఫార్మర్‌ ఎక్కి తిప్పలు పెడుతున్న రవిపై పోలీసులు ఈసారి కఠిన చర్యలు తీసుకోనున్నట్లు తెలుస్తోంది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని