ప్రేమించి పెళ్లాడాడు.. చిత్రహింసలు పెట్టాడు!
close

తాజా వార్తలు

Updated : 28/04/2021 07:57 IST

ప్రేమించి పెళ్లాడాడు.. చిత్రహింసలు పెట్టాడు!

భర్త తీరుపై లేఖ రాసి మహిళ బలవన్మరణం

విజయ                    ఆంజనేయులు

జూబ్లీహిల్స్‌, న్యూస్‌టుడే: ‘‘ప్రేమించి పెళ్లి చేసుకున్నాం.. పెళ్లయిన నాటి నుంచి నా భర్త పెట్టే బాధలు భరించలేకపోతున్నా.. రోజు చిత్రహింసలే.. తీవ్రంగా కొట్టడంతో పాటు ఉద్యోగానికి వెళ్లమని చెప్ఫి. అక్కడున్న ఉద్యోగులతో కలిపి లేని పోని అభాండాలు వేసేవాడు.. చివరికి నన్ను చంపడానికి చూశాడు.. నా భర్తకు వాళ్ల అన్నయ్య చంద్రయ్య అండ.. నన్ను చంపేస్తే వాళ్ల అక్క బిడ్డనిచ్చి పెళ్లి చేస్తానంటూ లేనిపోని మాటలు చెప్పాడు.. నా చావుకి ముఖ్య కారణం అతని సోదరులే.. నేను చనిపోతున్నాను.. నా భర్తను వదిలిపెట్టవద్ధు. నా పిల్లలను మాత్రం మా అమ్మనాన్న, సోదరుల వద్ద ఉంచండి’’ అంటూ ఓ వివాహిత లేఖ రాసి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన జూబ్లీహిల్స్‌ పోలీసు ఠాణా పరిధిలో చోటుచేసుకుంది. రహమత్‌నగర్‌ సమీపంలోని ఎస్పీఆర్‌ హిల్స్‌ రాజీవ్‌గాంధీనగర్‌లో నివసించే విజయ(31)కు పద్నాలుగేళ్ల కిందట ఆంజనేయులు అనే వ్యక్తితో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు. పెళ్లయిన రోజు నుంచి భర్త ఆమెను చిత్రహింసలకు గురిచేస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే ఈ నెల 26వ తేదీ రాత్రి 8 గంటల ప్రాంతంలో విజయ తన తల్లికి ఫోన్‌ చేశారు. పిల్లలు జాగ్రత్త అంటూ చెప్పి ఫోన్‌ కట్‌ చేశారు. ఈ క్రమంలోనే మంగళవారం ఉదయం విజయ ఇంట్లో తలుపులు వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు. కుమార్తె మృతికి అల్లుడు, అతని కుటుంబ సభ్యులే కారణమంటూ విజయ తల్లి మణెమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు జూబ్లీహిల్స్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. ఆత్మహత్యకు ముందు ఆమె రాసిన లేఖను స్వాధీనం చేసుకున్నారు. ఆంజనేయులును పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని