close

తాజా వార్తలు

Updated : 04/05/2021 04:31 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

రౌడీషీటర్‌ వినయ్‌కుమార్‌రెడ్డి అరెస్టు

వివిధ ఠాణాల్లో 42 కేసులు


మూలె వినయ్‌కుమార్‌రెడ్డి

కడప నేరవార్తలు, న్యూస్‌టుడే : చాలా కాలం నుంచి పరారీలో ఉన్న పేరు మోసిన రౌడీషీటర్‌ మూలె వినయ్‌కుమార్‌రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. ఇతనిపై 42 కేసులున్నాయి. అరెస్టైన వినయ్‌కుమార్‌రెడ్డిని సోమవారం ఎస్పీ అన్బురాజన్‌ కడప పోలీసు కార్యాలయంలో మీడియా ఎదుట హాజరుపరిచారు. ఎస్పీ వెల్లడించిన వివరాల మేరకు... కడప భరత్‌నగర్‌కు చెందిన మూలె వినయ్‌కుమార్‌రెడ్డి బీటెక్‌ చదువుతూ మధ్యలో ఆపేశాడు. డిగ్రీ, ఇంజినీరింగ్‌ చదివే విద్యార్థులను మభ్యపెడుతూ వారికి గంజాయి, మద్యం లాంటి చెడు వ్యసనాలకు అలవాటు చేసి వారిని తన స్వలాభాల కోసం ఉపయోగించుకునేవాడు. ముఖపుస్తకంలో రెచ్చగొట్టే విధంగా పోస్టులు పెడుతూ కడప నగరంలో గ్రూపులుగా ఏర్పడి గొడవలు సృష్టిస్తూ ప్రజాశాంతికి భంగం కలిగించేవాడు. చాలా మంది యువతకు చెడు అలవాట్లు నేర్పించి అతని ఆధ్వర్యంలో అనేక నేరాలకు పాల్పడ్డాడు. వినయ్‌కుమార్‌రెడ్డిపై ఇప్పటి వరకు కడప జిల్లాలోని వివిధ ఠాణాల్లో 11 కేసుల్లో నాన్‌ బెయిలబుల్‌ వారంట్లు పెండింగ్‌ ఉన్నాయి. ఇతర జిల్లాల్లోని వివిధ ఠాణాల్లో 31 కేసులున్నాయి. గతంలో పీడీ యాక్టుపై జైలుకు వెళ్లొచ్చాడు. 2018లో ఇతనిపై రౌడీషీట్‌ తెరిచారు. జైలుకు వెళ్లొచ్చి మళ్లీ నేరాలకు పాల్పడుతూ పోలీసులకు దొరకకుండా తిరుగుతున్నాడు. వినయ్‌కుమార్‌రెడ్డిపై చిన్నచౌకు పోలీసులు నిఘా ఉంచారు. దేవునికడప ఆర్చీ వద్ద ఉన్నట్లు సమాచారం రావడంతో పోలీసులు వెళ్లి అరెస్టు చేశారు. త్వరలో వినయ్‌కుమార్‌రెడ్డిపై మరోసారి పీడీ యాక్టు నమోదు చేస్తామని ఎస్పీ వెల్లడించారు. రౌడీషీటర్‌ అరెస్టులో కీలక పాత్ర పోషించిన డీఎస్పీ సునీల్‌, చిన్నచౌకు సీఐ అశోక్‌రెడ్డి, ఎస్సైలు అమర్‌నాథ్‌రెడ్డి, సత్యనారాయణ, రాజరాజేశ్వరరెడ్డిని ఎస్పీ అభినందించారు. నగదు బహుమతి ప్రకటించారు. సమావేశంలో అదనపు ఎస్పీ(కార్యకలాపాలు) దేవప్రసాద్‌ పాల్గొన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని