close

తాజా వార్తలు

Updated : 04/05/2021 04:41 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

క్రికెట్‌ బెట్టింగ్‌ ముఠా అరెస్టు

నిందితుల అరెస్టు చూపుతున్న ఎస్సై సూర్యరామచంద్రరావు

మోగల్లు (పాలకోడేరు), న్యూస్‌టుడే: ఆక్వాచెరువు వద్ద క్రికెట్‌ బెట్టింగ్‌ నిర్వహిస్తున్న ముఠాను పాలకోడేరు పోలీసులు ఆదివారం అర్ధరాత్రి అరెస్టు చేశారు. ఎస్సై సీహెచ్‌ సూర్యరామచంద్రరావు ఈ వివరాలను సోమవారం వెల్లడించారు. ఆయన కథనం ప్రకారం.. పాలకోడేరు మండలం మోగల్లులో ఓ ఆక్వా చెరువును అదే గ్రామానికి చెందిన చేబోలు ప్రసాద్‌, సైదు శివలింగేశ్వరరావులు లీజుకు తీసుకుని రొయ్యలు సాగు చేస్తున్నారు. ఈ చెరువు వద్ద ఉన్న రేకులషెడ్డులో ఎవరికీ అనుమానం రాకుండా క్రికెట్‌ బెట్టింగ్‌ నిర్వహిస్తున్నారు. ఆదివారం రాత్రి ఐపీఎల్‌ క్రికెట్‌ మ్యాచ్‌ జరుగుతున్న సమయంలో బెట్టింగ్‌ నిర్వహిస్తుండగా పోలీసులు అకస్మాత్తుగా దాడి చేసి చేబోలు ప్రసాద్‌, సైదు శివలింగేశ్వరరావు, అల్లూరి సీతారామరాజు, సైదు శ్రీనివాసులను అరెస్టు చేశారు. వారి నుంచి ఒక ల్యాప్‌టాప్‌, ఎనిమిది చరవాణులు, మూడు ద్విచక్రవాహనాలు, రూ.8,030 నగదును స్వాధీనం చేసుకున్నారు. నిందితుల నుంచి సేకరించిన వివరాల ఆధారంగా కొందరు పంటర్స్‌ను గుర్తించామని, విచారణ అనంతరం వారిపై కేసులు నమోదు చేస్తామని ఎస్సై తెలిపారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని