close

తాజా వార్తలు

Updated : 05/05/2021 08:29 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ఇష్టం లేని పెళ్లి చేశారని వివాహిత ఆత్మహత్య

అనూష మృతదేహం

పెద్దతిప్పసముద్రం గ్రామీణ: పీటీఎం మండలంలోని నవాబుకోట పంచాయతీకి చెందిన సుబ్రమణ్యం భార్య అనూష(20) తనకు ఇష్టం లేని పెళ్లి చేశారని ఆత్మహత్య చేసుకుంది. స్థానిక ఎస్సై సుబ్బారెడ్డి కథనం మేరకు.. అనంతపురం జిల్లా బొంతలపల్లె పంచాయతీ, పాళ్యంవాండ్లపల్లెకు చెందిన అనూషను పీటీఎం మండలంలోని నవాబుకోటకు చెందిన సుబ్రమణ్యంతో మూడు నెలల క్రితం పెద్దల సమక్షంలో పెళ్లి చేశారు. భర్త అంటే ఇష్టం లేదని అనూష వివాహం అయిన రోజు నుంచే తల్లిదండ్రుల వద్ద వాపోయింది. ఈ క్రమంలోనే సోమవారం తల్లిదండ్రుల వద్దకు వెళ్లి తనకు ఇష్టం లేని పెళ్లి చేశారంటూ, మీవద్దే ఉంటానంటూ చెప్పింది. అయితే ఆమెను మెప్పించి మెట్టినింటికి తీసుకొచ్చి సర్దిచెప్పి వెళ్లారు. దీంతో అవమానానికి గురైన అనూష మంగళవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకొని మృతి చెందినట్లు ఎస్సై తెలిపారు. పోస్టుమార్టం నిమిత్తం మదనపల్లె జిల్లా ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని