close

తాజా వార్తలు

Updated : 05/05/2021 04:51 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

బస్సులోనే కన్నుమూసిన ప్రయాణికుడు 


ఏసు

 

ఎటపాక, న్యూస్‌టుడే: ఎటపాక మండలం నందిగామ గ్రామానికి చెందిన పత్తిపాటి ఏసు(55), వృత్తి రీత్యా చిన్నపాటి కిరాణా దుకాణం నిర్వహిస్తుంటారు. సోమవారం పనిమీద గుంటూరు వెళ్లారు. మంగళవారం తిరిగి ఇంటికి వచ్చే క్రమంలో భద్రాచలం బస్సెక్కారు. బస్టాండుకు వచ్చాక అతన్ని కండక్టరు బస్సు దిగమని చెప్పేందుకు ప్రయత్నించారు. చలనం లేకుండా ఉండడంతో వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు భద్రాచలం ఏరియా ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఏసు మృతి గురించి తెలిసిన అతని కుటుంబీకులు కన్నీరుమున్నీరవుతున్నారు. గుండెపోటుతో మృతిచెందినట్లు భావిస్తున్నారు. భద్రాచలం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని