close

తాజా వార్తలు

Updated : 05/05/2021 04:54 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

రక్తమోడిన రహదారి

లారీని ఢీకొన్న కారు... ఇద్దరి దుర్మరణం

లారీ కింద నుంచి కారును తీసే ప్రయత్నం

మర్రిపాడు, న్యూస్‌టుడే: నెల్లూరుకు పని నిమిత్తం వచ్చి తిరిగి వెళుతున్న కారు.. లారీని ఢీకొన్న సంఘటనలో ఇద్దరు మృత్యువాత పడ్డారు. మర్రిపాడు మండలం పొంగూరు కండ్రిక వద్ద జాతీయ రహదారిపై ఈ ప్రమాదం చోటు చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. కడప జిల్లా, దువ్వూరుకు చెందిన నలుగురు వ్యక్తులు పనిపై నెల్లూరుకు వచ్చారు. సోమవారం రాత్రి తిరిగి సొంతూరికి పయణమయ్యారు. ఆ క్రమంలో పొంగూరుకండ్రిక సమీపంలోకి రాగానే.. వీరు ప్రయాణిస్తున్న కారు.. రహదారిపై ఆగిఉన్న లారీని బలంగా ఢీకొంది. ఈ ప్రమాదంలో చింతపూడి వెంకటదుర్గారావు(65), షేక్‌ అబ్దుల్‌ సత్తార్‌(58) కారులోనే ఇరుక్కుపోయి అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను పోలీసులు చికిత్స నిమిత్తం 108లో ఆత్మకూరు ఆసుపత్రికి తరలించారు. మృతదేహాలను ఉదయగిరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు మర్రిపాడు పోలీసులు తెలిపారు.

10 నిమిషాల వ్యవధిలో మళ్లీ..

పొంగూరుకండ్రిక వద్ద ఆగిన లారీని కారు ఢీకొన్న చోటే.. పది నిమిషాల వ్యవధిలో మరో ప్రమాదం చోటు చేసుంది. నెల్లూరు నుంచి కడప వెళుతున్న కారు గ్రామ సమీపంలోకి రాగానే రోడ్డు కనిపించక డ్రైవర్‌ ఒక్కసారి బ్రేక్‌ వేశారు. అంతలోనే వచ్చిన లారీ ఆగిన కారును ఢీకొంది. ఈ ప్రమాదంలో ఒకరికి తీవ్ర గాయాలు కాగా.. మరో ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆత్మకూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని