కన్న కొడుకును కడతేర్చిన తండ్రి
close

తాజా వార్తలు

Updated : 12/05/2021 04:55 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కన్న కొడుకును కడతేర్చిన తండ్రి

గుమ్మడిదల, న్యూస్‌టుడే: కూలి డబ్బుల విషయంలో తండ్రీ కొడుకుల మధ్య చోటుచేసుకున్న ఘర్షణలో తండ్రి చేతిలో కుమారుడు హతమైన సంఘటన కొత్తపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. గుమ్మడిదల ఎస్సై విజయకృష్ణ మంగళవారం తెలిపిన వివరాల ప్రకారం..గుమ్మడిదల మండలం కొత్తపల్గి గ్రామానికి చెందిన దంపతులు గడ్డమీది శ్రీనివాస్‌గౌడ్‌, పద్మ, కుమారుడు సాయికిరణ్‌గౌడ్‌ (23)లు కూలి పనులు చేసుకుంటు జీవిస్తారు. రోజు మాదిరిగానే సోమవారం ముగ్గురూ పనులు చేసుకుని రాత్రి ఇంటికి చేరుకున్నారు. తండ్రిని డబ్బు కావాలని కుమారుడు కావాలని అడగడంతో గొడవ ప్రారంభమైంది. ఇద్దరూ వాదులాడుకుంటుండగా తల్లి పద్మ భయపడి బయటకు వెళ్లి తెలిసిన వారింట్లో పడుకుంది. మంగళవారం ఉదయం ఆమె వచ్చి చూడగా కుమారుడు రక్తపు మడుగులో కొట్టుమిట్టాడుతూ కనిపించాడు. బిడ్డను తండ్రి కర్రతో తీవ్రంగా కొట్టాడని ఆమె గమనించిన కొద్ది సేపటికే సాయికిరణ్‌ మృతి చెందడంతో తల్లి బోరుమని విలపించింది. అక్కడే ఉన్న శ్రీనివాస్‌గౌడ్‌ను ఆమె కోపంతో రాయితో కొట్టడంతో గాయపడి బయటకు వెళ్లి పోయాడు.  అతడిని పోలీసులు అదుపులోకి తీసుకుని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. సంఘటన స్థలాన్ని జిన్నారం సీఐ లాలునాయక్‌ సందర్శించి వివరాలను సేకరించారు. గ్రామ వీఆర్‌ఏ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై విజయకృష్ణ తెలిపారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని