చోరీ కేసును ఛేదించిన పోలీసులు
close

తాజా వార్తలు

Updated : 17/05/2021 04:32 IST

చోరీ కేసును ఛేదించిన పోలీసులు

అనకాపల్లి పట్టణం: విశాఖ జిల్లా అనకాపల్లి పట్టణంలోని విజయరామరాజుపేటలో గత నెల 25వ తేదీన జరిగిన భారీ చోరీలో ముగ్గురు నిందితులను అరెస్టు చేసి 80.6తులాలు బంగారు ఆభరణాలు, వస్తువులను అనకాపల్లి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దీనికి సంబంధించి అనకాపల్లి ఇన్‌ఛార్జి డీఎస్పీ, దిశ పోలీసుస్టేషన్‌ డీఎస్పీ మల్ల మహేశ్వరరావు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఏప్రిల్ 25వ తేదీన విజయరామరాజుపేటలోని పట్నాల శంకర్‌రావుకు చెందిన కిరాణ దుకాణంలో చోరీ జరిగింది. 80తులాల బంగారు వస్తువులు, రూ.1.50లక్షల నగదు అపహరించినట్లు బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు ఇంటి దొంగ పనేనని గుర్తించి ముమ్మర విచారణ చేపట్టారు.

ప్రతాపరావు దుర్గారావు అనే వ్యక్తి శంకర్‌రావు దగ్గర గత 30ఏళ్లుగా పనిచేస్తున్నాడు. కిరాణ దుకాణంలో ఉన్న దేవుడి గదిలో యజమాని శంకర్‌రావు విలువైన బంగారు వస్తువులతో పాటు నగదును పెట్టడాన్ని దుర్గారావు గుర్తించాడు. వీటిని ఎలాగైనా అపహరించాలన్న దురుద్దేశంతో విజయరామరాజుపేటకు చెందిన పాత నేరస్థుడు ఎలియరాజుతో కలిసి పన్నాగం పన్నాడు. ఏప్రిల్‌ 25వ తేదీ రాత్రి ఎలియరాజు, దుర్గారావు కిరాణ దుకాణంలోకి ప్రవేశించగా డి.తిమోతి బయట కాపలా కాశాడు. దేవుడి గదిలోని లాకర్‌లో 80తులాల బంగారంతో పాటు రూ.1.5 లక్షల నగదును అపహరించారు. ఈ నెల 15వతేదీన అనకాపల్లి శంకర్‌మఠ్‌ వద్ద నిందితులు ముగ్గురిని పట్టుకుని విచారణ చేపట్టినట్లు డీఎస్పీ మహేశ్వరరావు వివరించారు. కేసుకు సంబంధించి 80.6తులాల బంగారు వస్తువులను, రెండు చరవాణులను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. నిందితులు ముగ్గురిని అరెస్టు చేసి కోర్టుకు తరలించినట్లు డీఎస్పీ తెలిపారు


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని