మహిళ దారుణ హత్య
close

తాజా వార్తలు

Updated : 17/05/2021 04:59 IST

మహిళ దారుణ హత్య

శామీర్‌పేట, న్యూస్‌టుడే: బంగారు నగల కోసం ఓ మహిళను దుండగులు దారుణంగా హత్య చేశారు. శామీర్‌పేట పోలీసులు, బాధితులు తెలిపిన వివరాల ప్రకారం..మేడ్చల్‌ జిల్లా శామీర్‌పేట మండలం లాల్‌గడిమలక్‌పేటకు చెందిన పొలంపల్లి లక్ష్మి(60) భర్త బుచ్చిరెడ్డి నాలుగేళ్ల క్రితం మృతి చెందారు. వీరికి అయిదుగురు కుమార్తెలు ఉండగా.. అందరికీ పెళ్లిళ్లు అయ్యాయి. ఓ కుమార్తెకు సొంతూరుకు చెందిన వ్యక్తితో వివాహం జరిపించారు. సంగారెడ్డి జిల్లా గుమ్మడిదలలో ఉన్న తన తమ్ముడి కుమారుడి వివాహానికి వెళ్తున్నట్లు చెప్పి శనివారం సాయంత్రం ఇంటి నుంచి లక్ష్మి బయలుదేరింది. కుమార్తెలు వారించినా వినలేదు. మామయ్య ఇంటికి కుమార్తె ఫోన్‌ చేయగా రాలేదని చెప్పారు. ఎక్కడా ఆచూకీ లభించకపోవడంతో కుమార్తె పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆదివారం లక్ష్మి మృతదేహం లాల్‌గడిమలక్‌పేట రైతువేదిక పక్కన కన్పించింది. స్థానికులు సమాచారంలో కుమార్తె వెళ్లి చూడగా గొంతు నులిమి హత్య చేసినట్లు గుర్తించింది. ఒంటిపై ఉండాల్సిన 5 తులాల బంగారు ఆభరణాలు కన్పించలేదు. సీఐ వి.సుధీర్‌కుమార్‌ ఘటనా స్థలాన్ని పరిశీలించి దర్యాప్తు చేపట్టారు. క్లూస్‌ టీమ్‌, జాగిలాలతో ఆధారాలు సేకరించారు. బంగారు ఆభరణాల కోసమా లేక వ్యక్తిగత కక్ష్యలతో ఎవరైనా హత్య చేశారా అనే కోణాల్లో విచారణ చేపట్టారు. ఈమేరకు కేసు నమోదు చేసి, ఇద్దరు యువకులను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని