మ‌త్తుమందిచ్చి విద్యార్థినిపై అత్యాచారం
close

తాజా వార్తలు

Updated : 19/05/2021 11:59 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

మ‌త్తుమందిచ్చి విద్యార్థినిపై అత్యాచారం

పొన్నూరు, న్యూస్‌టుడే: తన దుకాణంలో పనిచేస్తున్న యువతికి శీతల పానీయంలో మత్తు మందు కలిపి ఇచ్చి, అత్యాచారం చేసిన యజమానిపై బాధితురాలి తల్లిదండ్రులు మంగళవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారి కథనం ప్రకారం.. గుంటూరు జిల్లా పొన్నూరుకు చెందిన యువతి ఓ ఇంజినీరింగ్‌ కళాశాలలో మొదటి సంవత్సరం చదువుతోంది. కరోనా కారణంగా కళాశాల మూతపడడంతో ఏదైనా పనిచేసి కుటుంబానికి ఆసరాగా నిలవాలని పట్టణంలోని ఓ తినుబండారాల దుకాణంలో నెలకు రూ.5 వేల జీతంపై పనిలో చేరింది. దాని యజమాని సోమవారం దుకాణంలో ఎవరూ లేని సమయంలో ఆమెకు శీతల పానీయంలో మత్తు మందు కలిపి ఇచ్చాడు. ఆ పానీయాన్ని తాగిన కొద్దిసేపటికే ఆమె మత్తులోకి జారుకోవడంతో అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ తర్వాత విషయం అవగతమైన యువతి తల్లిదండ్రులకు చెప్పింది. అందిన ఫిర్యాదు మేరకు పొన్నూరు అర్బన్‌ పోలీసుస్టేషన్‌లో కేసు నమోదైంది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని