crime news: ఈ ప్రేమ చాలా దారుణం

తాజా వార్తలు

Published : 05/06/2021 01:22 IST

crime news: ఈ ప్రేమ చాలా దారుణం

యువతిని చంపి ఆత్మహత్య చేసుకున్న యువకుడు

తిరుపతి: చిత్తూరు జిల్లా సాంబయ్య కండ్రిగలో దారుణం చోటు చేసుకుంది. ప్రేమ పేరుతో యువతిని వేధించి అంగీకరించకపోవడంతో కత్తితో పొడిచి హత్య చేయడంతో పాటు అదే కత్తితో తాను కూడా గొంతు కోసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు ఓ యువకుడు. పోలీసుల కథనం ప్రకారం... చిత్తూరు గ్రామీణ మండలం సాంబయ్య కండ్రిగకు చెందిన యువతి సుష్మిత నగర శివార్లలోని సీఎంసీ ఆసుపత్రిలో ఏఎన్‌ఎంగా  పని చేస్తోంది. గ్రానైట్‌ పరిశ్రమలో కార్మికుడిగా పనిచేస్తున్న అదే గ్రామానికి చెందిన చిన్నా అనే యువకుడు గత కొద్దిరోజులుగా ప్రేమ పేరుతో ఆమెను వేధిస్తున్నాడు.

ప్రేమను అంగీకరించని సుష్మిత.. చిన్నాపై గుడిపాల పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో ఆగ్రహించిన చిన్నా  ఇవాళ ఉదయం ఇంట్లో ఒంటరిగా ఉన్న సుష్మితపై కత్తితో దాడి చేసి హతమార్చాడు. అనంతరం బయటకు వచ్చి గొంతుకోసుకుని పడిపోయాడు. సుష్మితపై దాడి చేసిన సమాచారం తెలుసుకున్న గ్రామస్థులు ఘటనాస్థలికి చేరుకుని ఇంటిముందు పడిపోయిన చిన్నాపై రాళ్ల దాడి చేశారు. అప్పటికే గొంతు కోసుకున్న చిన్నా.. గ్రామస్థుల రాళ్లదాడిలో ప్రాణాలు కోల్పోయాడు. చిత్తూరు ఒకటో పట్టణ సీఐ నరసింహరాజు ఘటనాస్థలికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.



Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని