మోసం కేసులో సాఫ్ట్‌వేర్‌ సంస్థ ఇండియా విభాగాధిపతి!
close

తాజా వార్తలు

Updated : 16/06/2021 04:27 IST

మోసం కేసులో సాఫ్ట్‌వేర్‌ సంస్థ ఇండియా విభాగాధిపతి!

నోటీసులు ఇచ్చిన జూబ్లీహిల్స్‌ పోలీసులు

జూబ్లీహిల్స్‌, న్యూస్‌టుడే: మోసం కేసులో ఓ ప్రముఖ సాఫ్ట్‌వేర్‌ సంస్థ ఇండియా విభాగాధిపతితోపాటు అతని కుటుంబ సభ్యులకు జూబ్లీహిల్స్‌ పోలీసులు నోటీసులు అందించారు. ఇన్‌స్పెక్టర్‌ రాజశేఖర్‌రెడ్డి కథనం ప్రకారం జూబ్లీహిల్స్‌ రోడ్‌ నంబరు-1లో ఉన్న ఓ టీవీ ఛానెల్‌ కార్యాలయంలో ఇంటీరియర్‌ పనులు చేయించడానికి గుడ్‌గావ్‌కు చెందిన ఎంఏడీఎస్‌ క్రియేషన్స్‌ సంస్థతో ఏడాదిన్నర క్రితం ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ సంస్థను ఓ సాఫ్ట్‌వేర్‌ సంస్థ ఇండియా విభాగాధిపతి ప్రదీప్‌ అగర్వాల్‌ సతీమణి మీను అగర్వాల్‌, ఆమె కుమార్తె దృష్టి అగర్వాల్‌ నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఛానెల్‌ నిర్వాహకులు ఇంటీరియర్‌ పనుల కోసం రూ.1.06 కోట్లకు ఒప్పందం కుదుర్చుకున్నారు.  ఆ మేరకు రెండు దఫాలుగా రూ.80లక్షలు చెల్లించారు. తరువాత సంస్థ నిర్వాహకులు పని పూర్తి చేయకుండా కాలయాపన చేశారు. ఈ నేపథ్యంలోనే శ్రేయా బ్రాడ్‌ కాస్టింగ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థ జనరల్‌ మేనేజర్‌ సురేందర్‌ ముస్లే ఈ ఏడాది ఫిబ్రవరిలో జూబ్లీహిల్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. రూ.80 లక్షలకుగాను రూ.43.85 లక్షల విలువైన మెటీరియల్‌ పంపారని, మిగతా డబ్బుకు సంబంధించి ఎలాంటి పనులు చేయలేదన్నారు. దీనికితోడు సంస్థ ప్రాజెక్టు మేనేజర్‌ ఆలం ఇంకా రూ.15 లక్షలు చెల్లించాలంటూ బెదిరింపులకు పాల్పడ్డారంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో పోలీసులు మీను అగర్వాల్‌, ఆమె కుమార్తె దృష్టి అగర్వాల్‌తోపాటు ప్రాజెక్టు మేనేజర్‌ ఆలమ్‌పై 406, 420, 506 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఈ వ్యవహారంలో తలదూర్చిన మీను అగర్వాల్‌ భర్త ప్రదీప్‌ అగర్వాల్‌ను సైతం కేసులో చేర్చినట్లు తెలిపారు. ఆయనకు సోమవారం గుడ్‌గావ్‌లో ఎస్సై నవీన్‌రెడ్డి ఆధ్వర్యంలో 41ఎ సీఆర్‌పీసీ కింద నోటీసులు అందించినట్లు ఇన్‌స్పెక్టర్‌ రాజశేఖర్‌రెడ్డి తెలిపారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని