సామాజిక మాధ్యమాల్లో వేధింపులు
close

తాజా వార్తలు

Updated : 19/06/2021 04:52 IST

సామాజిక మాధ్యమాల్లో వేధింపులు

నిందితుల అరెస్టు

మోషయ్య, షేక్‌ సలీమ్‌

నాగోలు, న్యూస్‌టుడే: బాలికకు వాట్సప్‌లో అసభ్య చిత్రాలు పంపుతూ వేధింపులకు గురిచేస్తున్న యువకుడిని రాచకొండ సైబర్‌క్రైమ్‌ పోలీసులు అరెస్టుచేశారు. ఇన్‌స్పెక్టర్‌ విజయ్‌కుమార్‌ కథనం ప్రకారం... జోగులాంబ గద్వాల జిల్లా ఐజ మండలంలోని ఉప్పల్‌కు చెందిన బైరిపోగుల మోషయ్య(19) నగరంలోని నాగోల్‌కు చెందిన ఓ బాలికతో పరిచయం పెంచుకున్నాడు. ఇది గమనించిన ఆమె తల్లిదండ్రులు అతడ్ని హెచ్చరించారు. ఇటీవల బాలికకు మోషయ్య వాట్సప్‌లో అసభ్య చిత్రాలు, సందేశాలు పంపుతూ వేధింపులకు గురిచేశాడు. బాలిక తండ్రి ఫిర్యాదుతో పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు.

మరో కేసులో మూడేళ్లుగా..

యువతికి అసభ్య చిత్రాలు, వీడియోలు పంపుతూ మూడేళ్లుగా వేధిస్తున్న నిందితుడిని రాచకొండ సైబర్‌క్రైమ్‌ పోలీసులు అరెస్టు చేశారు. ఇన్‌స్పెక్టర్‌ విజయ్‌కుమార్‌ కథనం ప్రకారం... నల్గొండ జిల్లా హాలియాలోని వీవీ కాలనీకి చెందిన షేక్‌ సలీమ్‌(20) పెయింటర్‌. ఇంజినీరింగ్‌ చదువుతున్న ఓ విద్యార్థిని ప్రొఫైల్‌తో నకిలీ ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలు తెరిచి మూడేళ్లుగా వేధించసాగాడు. తనను పెళ్లి చేసుకోవాలంటూ ఇబ్బందులకు గురి చేశాడు. యువతి ఫిర్యాదు మేరకు సాంకేతిక ఆధారాలు సేకరించి నిందితుడిని అరెస్టు చేశారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని