TS News: పెళ్లి పత్రికలో పేర్లు వేయలేదని వాగ్వాదం
close

తాజా వార్తలు

Updated : 21/06/2021 06:50 IST

TS News: పెళ్లి పత్రికలో పేర్లు వేయలేదని వాగ్వాదం

నలుగురికి కత్తిపోట్లు

అడ్డగుట్ట, న్యూస్‌టుడే: పెళ్లి పత్రికలో తల్లిదండ్రుల పేర్లు వేయలేదని ఇద్దరు సోదరులు, వారి సమీప బంధువులకు మధ్య జరిగిన గొడవ.. కత్తిపోట్లకు దారితీసింది. ఇద్దరికి తీవ్ర, ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి. బాధితుల్లో ఒకరు చేర్యాల వీఆర్వో. తుకారాంగేట్‌ సీఐ ఎల్లప్ప వివరాల ప్రకారం.. ఆజాద్‌ చంద్రశేఖర్‌నగర్‌కు చెందిన సురేష్‌ వివాహం ఈనెల 16న జరగ్గా, 18న స్థానికంగా విందు నిర్వహించారు. ఇదే ప్రాంతానికి చెందిన సోదరులు పి.శేఖర్‌(26), పి.సర్వేశ్‌(20).. పెళ్లి కుమారుడికి సమీప బంధువులు. తమ తల్లిదండ్రుల పేర్లు పెళ్లి పత్రికలో రాయలేదని.. వివాహం రోజు వాగ్వాదానికి దిగారు. 4 రోజులుగా గొడవలు జరుగుతున్నాయి. విందు అనంతరం శేఖర్‌.. అదే బస్తీలో నివసించే, బంధువైన బాలమణిని దూషించాడు. ఆదివారం పెద్దల సమక్షంలో మాట్లాడదామనుకున్నారు. చేర్యాల వీఆర్వో ప్రవీణ్‌(30), పరశురాం(35), ప్రతాప్‌కుమార్‌(32), బాలమణి, ఆమె భర్త యాదగిరి(42) కలిసి ఆదివారం వారి ఇంటికి వెళ్లారు. ఘర్షణకు దిగిన సోదరులు.. బాలమణి మినహా మిగతా నలుగురిపై కత్తితో దాడి చేసి, పరారయ్యారు. ప్రవీణ్, పరశురామ్‌కు తీవ్ర గాయాలయ్యాయి. గాయాలతోనే పీఎస్‌కు వచ్చిన బాధితులను.. పోలీసులు ఉస్మానియాకు తరలించారు. యాదగిరి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. నిందితులు ఆన్‌లైన్‌లో కత్తి ఖరీదు చేసినట్లు తెలిసింది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని