HYD: పెళ్లిప్పుడే వద్దన్న ప్రేయసి..
close

తాజా వార్తలు

Updated : 22/06/2021 10:35 IST

HYD: పెళ్లిప్పుడే వద్దన్న ప్రేయసి..

భవనం పైనుంచి దూకి ప్రేమికుడి బలవన్మరణం

బాలానగర్‌, న్యూస్‌టుడే: పెళ్లిప్పుడే వద్దని ప్రేయసి అన్నందుకు ఓ ప్రేమికుడు ఆవేశంతో భవనం నాలుగో అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. బాలానగర్‌ సీఐ వహీదుద్దీన్‌ కథనం ప్రకారం.. మూసాపేట రెయిన్‌బోవిస్టాస్‌లో నివాసముంటున్న కె.శుభమ్‌ (27) అమెజాన్‌లో ఉద్యోగి. మూడేళ్లుగా బాలానగర్‌ శోభనకాలనీ రోడ్డు నంబర్‌-1లో ఉంటున్న సోనియా గోగికర్‌ను ప్రేమిస్తున్నాడు. ఇద్దరూ ఒకరినొకరు ఇష్టపడటంతో కుటుంబసభ్యులు కూడా పెళ్లికి అంగీకరించారు. అయితే పెళ్లికి శుభమ్‌ తొందరపెడుతండటంతో ముందు తన అక్కకు పెళ్లి కావాల్సి ఉందని సోనియా గోగికర్‌ వాయిదా వేస్తూ వస్తోంది. ఆదివారం రాత్రి 11 గంటల సమయంలో శుభమ్‌ మరోసారి సోనియా ఇంటికెళ్లి పెళ్లి గురించి మాట్లాడాడు. అక్క పెళ్లి కాకుండా తాను పెళ్లి చేసుకోనని తేల్చి చెప్పడంతో ఆవేశంలో భవనం నాలుగో అంతస్తుకు చేరుకుని అక్కడి నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి తండ్రి కిషన్‌ ఫిర్యాదు మేరకు పోలీసులు సోమవారం కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.



Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని