మద్యం మత్తులో కారుతో యువకుడి వీరంగం
close

తాజా వార్తలు

Updated : 23/06/2021 07:19 IST

మద్యం మత్తులో కారుతో యువకుడి వీరంగం

నోహిత్‌రెడ్డి

మూసాపేట, న్యూస్‌టుడే: పీకలదాకా మద్యం తాగిన ఓ యువకుడు రహదారిపై సర్కస్‌ ఫీట్లను తలపించేలా కారును నడిపి వీరంగం సృష్టించాడు. ఈ ఘటనలో ఓ మహిళ ప్రమాదం నుంచి త్రుటిలో తప్పించుకుంది. తర్వాత అతి వేగంతో అక్కడి నుంచి 2 కిలోమీటర్ల దూరం ప్రయాణించాక రహదారి విభాగానిపై స్తంభాన్ని ఢీకొట్టాడు. ఈ ఘటన కూకట్‌పల్లి ఠాణా పరిధిలో మంగళవారం సాయంత్రం జరిగింది. ప్రత్యక్ష సాక్షులు, పోలీసులు తెలిపిన ప్రకారం.. మల్లంపేటకు చెందిన సి.హెచ్‌.నోహిత్‌రెడ్డి (24) గతంలో ప్రైవేటు సంస్థలో పనిచేసి మానేశాడు. ప్రస్తుతం ఖాళీగా ఉంటున్న ఇతను మద్యానికి బానిసయ్యాడు. తండ్రి యుగంధర్‌రెడ్డి విద్యుత్తు శాఖ ఉద్యోగి. తండ్రి కారు తీసుకుని మూసాపేట కైత్లాపూర్‌ వద్ద ఉన్న మద్యం దుకాణానికి వెళ్లాడు. అతిగా తాగి సాయంత్రం 6 గంటల సమయంలో ఐడీఎల్‌ చెరువు కట్టవైపు వేగంగా నడిపాడు. కైత్లాపూర్‌ చౌరస్తా సమీపంలో రోడ్డు దాటుతున్న ఓ మహిళను రాసుకుంటూ వెళ్లడంతో ఆమెకు స్వల్ప గాయాలయ్యాయి. తర్వాత ఐడీఎల్‌ చెరువు కట్ట మార్గంలో విభాగినిపై విద్యుత్తు స్తంభాన్ని ఢీకొట్టడంతో స్తంభం విరిగిపోయింది. కారు ముందుభాగం ధ్వంసమైంది. పోలీసులు అతనికి శ్వాస పరీక్షలు నిర్వహించగా 162 సాంద్రత నమోదైంది. నోహిత్‌రెడ్డిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని