AP news: 20 రోజులు..రూ.20 కోట్ల బెట్టింగులు
close

తాజా వార్తలు

Updated : 24/06/2021 07:51 IST

AP news: 20 రోజులు..రూ.20 కోట్ల బెట్టింగులు

 ప్రధాన సూత్రధారి జిల్లా వాసి
 నాయకులతో దిగిన చిత్రాలపై చర్చ


సోమన్న

ఈనాడు - కాకినాడ: దుబాయ్‌లో జరుగుతున్న పాకిస్థాన్‌ క్రికెట్‌ ప్రీమియర్‌ లీగ్‌ మ్యాచ్‌పై ఆన్‌లైన్‌ బెట్టింగులకు పాల్పడుతున్న ముఠాలో ప్రధాన సూత్రధారి సోమన్న మన జిల్లాకు చెందిన వ్యక్తిగా సైబరాబాద్‌ పోలీసులు గుర్తించారు. పరారీలో ఉన్న సోమన్న కోసం విస్తృతంగా గాలిస్తున్నారు. రాయవరం మండలంలోని సోమేశ్వరం గ్రామానికి చెందిన ఈయనకు రాజకీయ నాయకులతో సత్సంబంధాలు ఉన్నట్లు ప్రచారం సాగుతోంది. నిందితుడికి పలు వ్యాపారాల్లో వాటాలు ఉన్నట్లు జిల్లా పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. తెలంగాణ పోలీసుల నుంచి ఈ కేసు విషయమై ఎలాంటి సమాచారం రాలేదని రాజమహేంద్రవరం అర్బన్, జిల్లా ఎస్పీ కార్యాలయ వర్గాలు తెలిపాయి. హైదరాబాద్‌లోని బాచుపల్లి ఠాణా పరిధిలోని నిజాంపేటలోని ఓ బహుళ అంతస్తుల భవనంలో ఆన్‌లైన్‌ బెట్టింగులు నిర్వహిస్తుండగా మాదాపూర్‌ ఎస్‌వోటీ పోలీసులు సోమవారం రాత్రి ఆకస్మికంగా దాడులు చేసి ప్రధాన సూత్రధారికి సహకరిస్తున్న అయిదుగురిని అరెస్టు చేశారు. సోమన్న కోసం వేట సాగిస్తున్నారు. సుమారు 20 రోజుల వ్యవధిలోనే రూ.20 కోట్లకుపైగా బెట్టింగులు నిర్వహించినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించడంతో ఈ కేసుకు ప్రాధాన్యం పెరిగింది. ఏపీ, తెలంగాణతోపాటు కొన్ని రాష్ట్రాల్లో బెట్టింగుల నిర్వహణలో నిందితుడు కీలక పాత్ర పోషిస్తున్నట్లు గుర్తించారు. వైకాపా ముఖ్య నాయకుడు వైవీ సుబ్బారెడ్డి, రాజానగరం ఎమ్మెల్యే 
జక్కంపూడి రాజాతో సోమన్న ఉన్న ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో బుధవారం హల్‌చల్‌ చేయడం చర్చనీయాంశమైంది. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని