మూడోపెళ్లి కావాలన్నాడు.. మర్మాంగం కోసి చంపింది

తాజా వార్తలు

Updated : 27/06/2021 06:33 IST

మూడోపెళ్లి కావాలన్నాడు.. మర్మాంగం కోసి చంపింది

ముజఫర్‌నగర్‌ : మూడోపెళ్లి చేసుకుంటానని రోజూ హింసిస్తున్న భర్త మర్మాంగాన్ని కోసి హతమార్చిన ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్‌ జిల్లాలో వెలుగుచూసింది. తన భర్త పెట్టే హింస భరించలేకే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు ఆమె పోలీసులకు తెలిపింది. భౌరా ఖుర్ద్‌ గ్రామ మసీదులో మౌల్వీగా అతడు బాధ్యతలు నిర్వర్తించేవాడు. భౌరా కాలన్‌ పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. మహిళను అరెస్టు చేసి దర్యాప్తు ప్రారంభించారు. తొలుత అనుమానాస్పద మృతిగా పరిగణించిన పోలీసులు.. మృతుని భార్యను తమదైన శైలిలో విచారించగా ఆమె నేరాన్ని ఒప్పుకుంది. ‘నా భర్తకు నేను రెండో భార్యను. మాకు అయిదుగురు కుమార్తెలు. ఇప్పుడు మూడోపెళ్లికి సిద్ధమయ్యాడు. నేను ఒప్పుకోకపోవడంతో తరచూ కొట్టేవాడు. నా పెద్ద కుమార్తెనే వివాహం చేసుకోవాలని చూశాడు’ అని పోలీసుల విచారణలో నిందితురాలు తెలిపింది. బుధవారం రాత్రి నిద్రపోతున్న భర్తపై దాడిచేసి దారుణంగా హత్య చేసినట్లు పోలీసులు చెప్పారు. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని