AP News: తీరు మార్చుకోమంటే.. చంపేశాడు

తాజా వార్తలు

Updated : 30/06/2021 10:18 IST

AP News: తీరు మార్చుకోమంటే.. చంపేశాడు

పోలీసుల అదుపులో నిందితుడు..?

బిడ్డని ఎత్తుకుని భార్య మృతదేహం ఉన్న సూట్‌కేసును లాక్కెళుతున్న భర్త

తిరుపతి(నేరవిభాగం): ‘నీ తీరు మార్చుకుంటే సరే. లేకపోతే నువ్వు మాకు అవసరం లేదు. నేను, పాప నా జీతంతో సంతోషంగా బతుకుతాం’ అని భార్య చెప్పడంతోనే ఆమెపై కక్ష పెంచుకున్నాడు. నిద్రిస్తున్న సమయంలో దిండుతో అదిమి చంపేశాడు. తిరుపతి రుయా ఆస్పత్రి ప్రాంగణంలో జూన్‌ నెల 23వ తేదీ వెలుగులోకి వచ్చిన ‘సూట్‌కేసులో కాలిన మృతదేహం’ కేసులో అసలు విషయాలు వెలుగులోకి వచ్చాయి. కేసులో ప్రధాన నిందితుడు శ్రీకాంత్‌రెడ్డిని నెల్లూరు జిల్లా పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.

కడప జిల్లా బద్వేలుకు చెందిన శ్రీకాంత్‌రెడ్డి, చిత్తూరు జిల్లా రామసముద్రానికి చెందిన భువనేశ్వరి(27)ని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. శ్రీకాంత్‌రెడ్డి అవినీతి నిర్మూలన పేరిట ఓ సంస్థను స్థాపించాడు. రూ.90 వేలు జీతం తీసుకునే భార్యను వేధించేవాడు. ఆమె జీతం విలాసాలకు ఖర్చు చేసేవాడు. ఆమె బంధువులు, స్నేహితుల ద్వారా రూ.లక్షల్లో అప్పు తీసుకొని తనకు ఇవ్వాలని ఒత్తిడి చేశాడు. ఈక్రమంలో తీరు మార్చుకోవాలని భర్తకు సూచించింది. ఇక తన ఆటలు సాగవని భావించిన శ్రీకాంత్‌రెడ్డి ఈ నెల 22న వేకువజామున 2 గంటల సమయంలో నిద్రపోతున్న భార్య ముఖంపై దిండు అదిమి హతమార్చాడు. అదేరోజు మధ్యాహ్నం ఓ సూట్‌కేసులో మృతదేహాన్ని కుక్కి ట్యాక్సీలో రుయా ఆస్పత్రి ప్రాంగణంలోకి తీసుకెళ్లాడు. అక్కడ భార్య మృతదేహానికి నిప్పుపెట్టాడు. మరుసటి రోజు కాలిన మనిషి అవశేషాలు వెలుగులోకి రావడంతో కూతురిని రామసముద్రంలోని అమ్మమ్మకు అప్పగించి పరారయ్యాడు. చివరకు మృతురాలి అక్క కుమార్తెకు అనుమానం వ్యక్తం చేయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది.



Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని