బురిడీ... కొట్టించబోయి.. బుక్కైన వ్యాపారి!

తాజా వార్తలు

Published : 03/07/2021 08:24 IST

బురిడీ... కొట్టించబోయి.. బుక్కైన వ్యాపారి!

పాలేపల్లిలో ప్యాకెట్లతో వ్యాపారి, గ్రామస్థులు

దోమ, న్యూస్‌టుడే: ప్రజలను బురిడి కొట్టించబోయిన ఓ వ్యాపారి అడ్డంగా దొరికిపోయాడు. ఈ సంఘటన దోమ మండలం దిర్సంపల్లి, పాలేపల్లి గ్రామాల్లో శుక్రవారం చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. దుస్తులు ఉతికే పొడి, సబ్బు ప్యాకెట్లను వాహనంలో దిర్సంపల్లికి తీసుకొచ్చి విక్రయించాడు. కొందరు వాటిని విప్పి చూడగా సగం ఉప్పు ఉంది. దీంతో గ్రామస్థులు నిలదీసేలోపే అక్కడి నుంచి వాహనంతో జారుకొని పాలేపల్లి వైపు వెళ్లాడు. ఆ గ్రామ సర్పంచి భర్త కొండారెడ్డి విషయం పాలేపల్లి సర్పంచి భర్త తిరుపతికి ఫోన్‌ ద్వారా సమాచారం ఇచ్చారు. వాహనం గ్రామంలోకి ఆయన నిలిపి ఆరా తీయగా దుస్తులు ఉతికే పొడి విక్రయిస్తున్నట్లు చెప్పాడు. దీంతో ఆయన దుకాణం వద్దకు తీసుకువెళ్లి ప్యాకెట్లు తీసుకుని చిరునామా గురించి ఆరా తీశారు. పొంతనలేని సమాధానాలు చెప్పడంతో దోమ పోలీసులకు సమాచారం ఇచ్చి స్టేషన్‌కు పంపించారు. మహబూబ్‌నగర్‌ జిల్లా కోస్గికి చెందిన రాముడుగా గుర్తించారు. పోలీసులు విచారించగా.. హైదరాబాద్‌ నుంచి ప్యాకెట్లు తెచ్చానని, తనకూ తెలియదని చెప్పడంతో కౌన్సెలింగ్‌ ఇచ్చి వదిలిపెట్టారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని