AP News: ప్రాణం పోయిందని పట్టుకుంటే.. అతని ఆయువే తీసింది

తాజా వార్తలు

Updated : 03/07/2021 06:57 IST

AP News: ప్రాణం పోయిందని పట్టుకుంటే.. అతని ఆయువే తీసింది

మంత్రాలయం, న్యూస్‌టుడే: ఎవరి ఇంట్లో పాము కనిపించినా ఆ వ్యక్తినే పిలిచి పట్టిస్తారు. మరి అలాంటి వ్యక్తినే పాము కాటేసింది.. చనిపోయిందనుకుని భావించి దానిని చేతిలో పట్టుకుని పరిశీలిస్తుండగా ఒక్కసారిగా కాటేసింది. ఫలితంగా అతని ప్రాణాలు గాలిలో కలిశాయి. ఈ ఘటన మంత్రాలయం మండలం మాలపల్లిలో శుక్రవారం జరిగింది. గ్రామంలోని పాఠశాల వద్ద పాము కనిపించడంతో జనం వెంటనే రంగస్వామిని పిలిచించారు. అతను అక్కడికి చేరుకుని దానిని కర్రతో కొట్టాడు. చనిపోయిందనుకుని చేతితో పట్టుకుని చూస్తుండగా ఇంతలో కాటు వేసింది. వెంటనే స్థానికులు అతడిని చికిత్స నిమిత్తం ఆదోని ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధరించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని