అమెజాన్‌లో కత్తి కొని ప్రేమించిన యువతి వద్దకు!

తాజా వార్తలు

Updated : 08/07/2021 07:28 IST

అమెజాన్‌లో కత్తి కొని ప్రేమించిన యువతి వద్దకు!

జూబ్లీహిల్స్‌, న్యూస్‌టుడే: దాదాపు నాలుగేళ్లపాటు ప్రేమించుకున్నారు.. తరువాత గొడవపడ్డారు. ఈ క్రమంలో.. మాట్లాడుతానంటూ రాత్రి వేళ యువతి వద్దకు కత్తితో వచ్చాడు.. ఆమె అప్రమత్తమై 100 నంబరుకు ఫోన్‌ చేసింది. నిమిషాల్లో అక్కడికి చేరుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.. జూబ్లీహిల్స్‌ ఇన్‌స్పెక్టర్‌ రాజశేఖర్‌రెడ్డి కథనం ప్రకారం.. బోరబండ సమీపంలోని బంజారానగర్‌లో నివసించే బండారి శ్రీకాంత్‌(25) నాలుగేళ్ల కిందట ఎన్‌ఎస్‌బీ నగర్‌లో ఉండేవాడు. ఓ స్టార్‌ హోటల్‌ జిమ్‌లో రిసెప్షనిస్టుగా పనిచేస్తున్న యువతి(23)తో పరిచయం ఏర్పడింది. తరువాత వీరి మధ్య గొడవలు జరగడంతో 2020 అక్టోబరులో యువతి ఫిర్యాదుతో మాదాపూర్‌ పోలీస్‌ స్టేషన్‌లో శ్రీకాంత్‌పై కేసు నమోదైంది. కొద్ది రోజులుగా ఆమెను కలవాలంటూ అతను కోరుతున్నాడు.   మంగళవారం అర్ధరాత్రి 12 గంటలకు ఫోన్‌ చేసిన శ్రీకాంత్‌ ఆ యువతి ఇంటికి వెళ్లాడు.  ఇంట్లో యువతి, ఆమె సోదరి ఉన్నారు. కూర్చొని మాట్లాడుతుండగా అతని వెనుక భాగంలో కత్తి ఉన్నట్లు యువతి సోదరి గుర్తించింది. తన సోదరిని పిలిచి గదిలోకి వెళ్లి తలుపు పెట్టుకోవాలని సూచించింది. దీంతో యువతి గదిలోకి వెళ్లి రాత్రి 12.53 గంటలకు 100కు సమాచారం అందించింది. ఈలోపు యువతి సోదరి అతన్ని మాటల్లో పెట్టింది. సమాచారం అందుకున్న జూబ్లీహిల్స్‌ కార్‌2 సిబ్బంది సందీప్‌ తదితరులు వెంటనే యువతి ఇంటికి చేరుకున్నారు. యువకుడిని తనిఖీ చేయగా  జాంబియా(కత్తి) లభించింది. శ్రీకాంత్‌ను జూబ్లీహిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. సోదరుడి జన్మదిన వేడుకల కోసం కత్తిని తీసుకెళ్లినట్లు అతడు పోలీసులకు చెప్పాడు. యువతిపై దాడి చేసేందుకు వెళ్లాడా.. అనే కోణంలో వారు విచారిస్తున్నారు. ఈ కత్తిని  అమెజాన్‌లో రూ. 1500కు కొనుగోలు చేసినట్లు పోలీసులు గుర్తించారు. నిందితుడిని అరెస్ట్‌ చేసి కేసు దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని