TS news: ప్రేమ పేరిట వల

తాజా వార్తలు

Updated : 09/07/2021 07:39 IST

TS news: ప్రేమ పేరిట వల

కిలాడి దంపతుల అరెస్టు 

నారాయణగూడ, న్యూస్‌టుడే: ఫేస్‌బుక్‌లో నకిలీ ఖాతాలు తెరిచి, ప్రేమ పేరుతో కొందరిని, ఉద్యోగాలిస్తామంటూ మరికొందరిని మోసం చేస్తున్న కిలాడీ దంపతులను హైదరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు అరెస్టు చేశారు. ఏసీపీ కె.వి.ఎం.ప్రసాద్‌ కథనం ప్రకారం.. మహబూబ్‌నగర్‌ జిల్లా కోస్గికి చెందిన పొన్నం నవీన్‌కుమార్‌, భార్య శిరీషతో కలిసి లింగంపల్లిలో ఉంటున్నారు. వీరికి మూడు నెలల పసిబిడ్డ ఉంది. ఓ మెడికల్‌ షాప్‌లో క్యాషియర్‌గా పని చేశాడు. సంపాదన సరిపోక మోసాలు చేయాలని నిర్ణయించుకున్నాడు. భార్య సహకారంతో ఫేస్‌బుక్‌లో శ్వేతారెడ్డి పేరిట నకిలీ ఖాతా తెరిచారు. యువకులకు ఫ్రెండ్‌ రిక్వెస్ట్‌లు పంపించారు. నగరానికి చెందిన ఓ బాధితుడు వీరి వలలో చిక్కాడు. ఆదాయపు పన్నుల శాఖలో ఉద్యోగాలున్నాయని.. ఆ ఉద్యోగం మీకే ఇప్పిస్తానని నమ్మించారు. ప్రాసెసింగ్‌ తదితర ఖర్చుల పేరుతో రూ.8 లక్షలు లాగారు. బాధితుడు తేరుకునేలోపే ప్రేమ వల విసిరింది. మరో రూ.2.50 లక్షలు బదిలీ చేయించుకుంది. జూబ్లీహిల్స్‌కు చెందిన మరొకరిని మోసం చేసి రూ.2 లక్షల గుంజింది. ఉన్నట్టుండి కిలాడీ దంపతులు ఫోన్‌ ఆపేయడంతో బాధితులు హైదరాబాద్‌ సైబర్‌ పోలీసులను ఆశ్రయించారు. ఫోన్‌ సిగ్నళ్ల ఆధారంగా వారిని గుర్తించిన పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిపై రాచకొండ, సైబరాబాద్‌ పోలీసు కమిషనరేట్లలోనూ కేసులున్నాయని తెలిసింది. నవీన్‌కుమార్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. పసిపాప ఉండటంతో శిరీషకు నోటీసులిచ్చి పంపించారు. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని