Crime: పెళ్లింట.. పేలిన జనరేటర్‌

తాజా వార్తలు

Updated : 14/07/2021 07:09 IST

Crime: పెళ్లింట.. పేలిన జనరేటర్‌

నవ దంపతులు సహా ఆరుగురు మృత్యువాత

బల్లార్ష, న్యూస్‌టుడే: జనరేటర్‌ పేలిన ఘటనలో గదిని చుట్టేసిన పొగతో ఆరుగురు దుర్మరణం పాలైన ఘటన మహారాష్ట్రలో చోటుచేసుకుంది. ఎస్పీ అరవింద్‌ సాల్వే తెలిపిన వివరాల ప్రకారం.. చంద్రాపూర్‌ పట్టణ సమీపంలోని దుర్గాపూర్‌ గ్రామ నివాసి రమేష్‌ లష్కరే గుత్తేదారుగా పనిచేస్తున్నారు. ఆయన కుమారుడు అజయ్‌ వివాహం పది రోజుల కిందట అదే గ్రామానికి చెందిన మాధురితో జరిగింది. రెండు రోజుల కిందట కోడలిని ఇంటికి తీసుకొచ్చారు. ఇంట్లో పండుగ వాతావరణం ఉంది. సోమవారం రాత్రి భారీ వర్షం పడటంతో విద్యుత్తు సరఫరా నిలిచిపోయింది. పెళ్లి కోసమని గతంలో అద్దెకు తెచ్చుకున్న జనరేటర్‌ ఇంట్లో ఉండడంతో దానిని ఆన్‌ చేశారు. భోజనాలు చేశాక అంతా నిద్రపోయారు. అర్ధరాత్రి సమయంలో అది పేలిపోయింది. పేలుడుకు వెలువడిన పొగతో ఊపిరి ఆడక అసువులు బాశారు. రమేష్‌ లష్కరే(45), అజయ్‌(25), మాధురి(20), వరుడి తోబుట్టువులు పూజ(14), లఖన్‌(10), కృష్ణ(8) ఘటనా స్థలంలోనే మృతి చెందారు. అజయ్‌ చిన్నాన్న బీసు లష్కర్‌(40) ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని