తాగిన మైకంలో తండ్రిని హత్య చేసిన తనయుడు

తాజా వార్తలు

Updated : 27/07/2021 05:23 IST

తాగిన మైకంలో తండ్రిని హత్య చేసిన తనయుడు


మృతదేహాన్ని పరిశీలిస్తున్న పోలీసులు

ఆదిలాబాద్‌ నేరవిభాగం, న్యూస్‌టుడే: తాగిన మైకంలో కన్న తండ్రినే తనయుడు హత్య చేసిన ఆదిలాబాద్‌ జిల్లా కేంద్రంలో సోమవారం రాత్రి చోటుచేసుకుంది. ఆదిలాబాద్‌ గ్రామీణ సీఐ పురుపోత్తంచారి తెలిపిన వివరాల ప్రకారం.. కైలాస్‌నగర్‌లోని ఎస్సీ కాలనీలో ఉంటున్న మోదుగుపల్లి బొందాలు(65), కుమారుడు సురేష్‌లు కూలీ పని చేస్తూ జీవనం సాగిస్తారు. సోమవారం రాత్రి వారిరువురి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. తాగిన మైకంలో ఉన్న కుమారుడు సురేష్‌ తండ్రిని బండరాయితో మోదటంతో బొందాలు తలపగిలి అక్కడికక్కడే మృతి చెందారు. నిందితుడు సురేష్‌ పరారీలో ఉన్నాడు. మృతదేహాన్ని రిమ్స్‌ శవాగారానికి తరలించారు. ఘటనా స్థలాన్ని డీఎస్పీ ఎన్‌ఎస్‌వీ వెంకటేశ్వర్‌రావు సందర్శించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని